ఎన్టీఆర్ సరసన నిత్యామీనన్

Published on Apr 13,2019 10:55 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నిత్యామీనన్ నటించనున్నట్లు అది కూడా భార్య పాత్రలో అథితి పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది . ఎన్టీఆర్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం '' ఆర్ ఆర్ ఆర్ '' . దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న విషయం తెలిసిందే . 

మన్యం వీరుడు కొమరం భీం కు ఇద్దరు భార్యలు కాగా అందులో ఒక భార్య గా నిత్యామీనన్ ని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది . చిన్న పాత్రే అయినప్పటికీ ఆ పాత్రకు ప్రాముఖ్యత ఉండటంతో జక్కన్న నిత్యా ని ఎంపిక చేయడానికి నిర్ణయించుకున్నాడట . ఎన్టీఆర్ సరసన నటించే మరో మెయిన్ హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డాడు జక్కన్న . 

ఇంతకుముందు ఎన్టీఆర్ - నిత్యామీనన్ ల కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ అనే సూపర్ హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే . ఆ సినిమా తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ - నిత్యామీనన్ లు చేస్తున్న సినిమా ఇదే అవుతుంది . భారీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2020 లో విడుదల చేయనున్నారు .