మెగా మేనల్లుడు తో మారుతి

Published on Feb 09,2019 04:46 PM

వినోద ప్రధాన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకులు మారుతి అన్న విషయం తెలిసిందే . అయితే అక్కినేని నాగచైతన్య తో మారుతి చేసిన శైలజారెడ్డి అల్లుడు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు దాంతో కొంత గ్యాప్ తీసుకొని మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది . 

సాయి ధరమ్ తేజ్ గతకొంత కాలంగా వరుస ప్లాప్ లతో రేసులో లేకుండాపోయాడు . ప్రస్తుతం చిత్రలహరి అనే సినిమా చేస్తున్నాడు . ఆ సినిమా అయ్యాక మారుతి తో సినిమా చేసే అవకాశం ఉంది . మారుతి కి మెగా హీరోలంటే ప్రత్యేకమైన అభిమానం కాబట్టి సాయి ధరమ్ తేజ్ ని విభిన్నంగా చూపించడమే కాకుండా సక్సెస్ కూడా ఇచ్చిన ఆశ్చర్యం లేదు .