హీరోయిన్ బూతుల వర్షం

Published on Dec 22,2018 12:51 PM

మలయాళ హీరోయిన్ మంజు సవేకర్ హోటల్ సిబ్బంది పై విరుచుకు పడటమే కాకుండా బండబూతులు తిట్టిన సంఘటన సంచలనం సృష్టించింది . అంతేకాదు పెద్ద వివాదాన్ని కూడా రాజేసింది . మంజు సవేకర్ ఓ మలయాళ చిత్రంలో నటించడానికి ఒప్పుకుంది , సినిమా షూటింగ్ నిమిత్తం కేరళలోని నాగర్ కోవిల్ కు వెళ్ళింది . అక్కడ మంజు కి హోటల్ లో రూం బుక్ చేసారు . అయితే షూటింగ్ కి వెళ్లి వచ్చేసరికి బెడ్ రూం ని క్లీన్ చేయలేదని ఒక్కసారిగా అపరకాళిగా మారింది . బూతుల వర్షం కురిపించింది . 

దాంతో హోటల్ సిబ్బంది షాక్ అయ్యారట ! హీరోయిన్ అయి ఉండి ఇలా బూతులు తిట్టడం ఏంటి అని పోలీసులకు ఫిర్యాదు చేశారట . ఇంకేముంది సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేసి మంజు సవేకర్ చేత హోటల్ సిబ్బందికి సారీ చెప్పించారట . నేను హీరోయిన్ ని అలాంటిది నాచేత వాళ్లకు సారీ చెప్పిస్తారా ? అంటూ కన్నీళ్లు తెచ్చుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయిందట పాపం .