మలైకా ఎందుకు విడాకులు తీసుకుందో తెలుసా

Published on Feb 20,2019 11:36 AM

బాలీవుడ్ భామ మలైకా అరోరా అర్భాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే . అయితే ఇన్నాళ్లకు ఏ భామ విడాకుల గురించి నోరు విప్పింది . ఇంతకీ మలైకా అరోరా అర్భాజ్ నుండి విడాకులు ఎందుకు తీసుకుందో తెలుసా ...... అర్భాజ్ ఖాన్ తో జీవితం సాఫీగా సాగలేదని , సంతోషంగా లేనని అలాంటప్పుడు ఇంకా కలిసి ఉండటంలో అర్ధం లేదని అందుకే విడాకులు తీసుకున్నానని తెలిపింది మలైకా . 

దాదాపు 17 ఏళ్ల కాపురం మలైకా - అర్భాజ్ ఖాన్ లది , వాళ్లకు 14 ఏళ్ల  ఒక కొడుకు కూడా అయితే మలైకా అరోరా కుర్ర హీరో అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగిస్తూ అర్భాజ్ కు విడాకులు ఇచ్చింది . ప్రస్తుతం అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తోంది మలైకా . త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలుస్తోంది .