140 కోట్ల బిజినెస్ తో మహేష్ సంచలనం

Published on Apr 13,2019 10:31 AM

మహేష్ బాబు మహర్షి చిత్రంతో సంచలనం సృష్టిస్తున్నాడు . మహర్షి చిత్రాన్ని మే 9 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దాంతో బిజినెస్ పరంగా మంచి డిమాండ్ ఏర్పడింది . మొత్తం మీద మహర్షి చిత్రం 140 కోట్ల బిజినెస్ చేస్తోంది . మహేష్ బాబు కున్న క్రేజ్ తో మహర్షి చిత్రానికి ఈ డిమాండ్ ఏర్పడింది . శాటిలైట్ , డిజిటల్ , హిందీ డబ్బింగ్ , ఓవర్ సీస్ , సీడెడ్ హక్కుల రూపంలో 85 కోట్లకు చేరుకుంది మహర్షి బిజినెస్ . 

ఇంకా పలు ఏరియాల బిజినెస్ తో మహర్షి సినిమా 140 కోట్ల వరకు చేరుకోవడం ఖాయమని అయితే షేర్ మాత్రం వంద కోట్ల పైన వస్తేనే బయ్యర్లు ఒడ్డున పడతారని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ సినిమాకు వంద కోట్లకు పైగా బిజినెస్ జరుగుతోంది . 

మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుండగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు . త్వరలోనే మహర్షి ట్రైలర్ ని భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేసి మే 9 న మహర్షి చిత్రాన్ని విడుదల చేయనున్నారు . వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మించారు.