లక్ష్మీస్ వీరగ్రంథం ట్రైలర్

Published on Mar 14,2019 10:28 AM

లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ రాంగోపాల్ వర్మ సినిమా తీసి పెద్ద వివాదాన్ని సృష్టిస్తే దర్శకులు తేజ సమీప బంధువు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మాత్రం '' లక్ష్మీస్ వీరగ్రంథం '' అంటూ లక్ష్మీపార్వతి ని విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు . లక్షీస్ ఎన్టీఆర్ కు సంబందించిన ఏదో ఒక మెటిరీయల్ రాగానే లక్ష్మీస్ వీరగ్రంథం మెటీరియల్ ని కూడా రిలీజ్ చేయడం అలవాటు చేసుకున్నాడు కేతిరెడ్డి. 

తాజాగా లక్ష్మీస్ వీరగ్రంథం అంటూ ఓ ట్రైలర్ ని రిలీజ్ చేసాడు . ట్రైలర్ చూస్తుంటే సినిమా నాసిరకంగా ఉండేలా కనబడుతోంది . అసలు తీస్తున్నాడో ? లేదో ? కానీ ఇలా పబ్లిసిటీ మాత్రం చేసుకుంటున్నాడు . 2 నిమిషాల 42 సెకన్ల పాటు ఉన్న ట్రైలర్ లో లక్ష్మీపార్వతిని విలన్ గా చూపిస్తున్నాడు . ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు ని విలన్ గా చూపిస్తున్నాడు రాంగోపాల్ వర్మ.