సీక్వెల్ కు సిద్దమైన కేజీఎఫ్

Published on Feb 09,2019 04:01 PM

కన్నడ చిత్రం కేజీఎఫ్ 1 సంచలన విజయం సాధించి కన్నడ చిత్ర రంగంలో చరిత్ర సృష్టించింది . యష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు . తెలుగు , కన్నడా , హిందీ , తమిళ బాషలలో రిలీజ్ అయి 225 కోట్ల వసూళ్ల ని సాధించింది . కన్నడ చిత్రం  ఇంతటి భారీ విజయం సాధించిన దాఖలాలు లేవు . 

కన్నడ సినిమా కేవలం కర్ణాటకకు మాత్రమే పరిమితంగా ఉండేది కానీ ఆ బ్యారికేడ్లని తుడిచేసింది కేజీఎఫ్ చిత్రం . ఇక ఇంతటి సంచలన విజయం సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ కు రంగం సిద్ధమైంది . వచ్చే నెలలో కేజీఎఫ్ 2 సెట్స్ మీదకు వెళ్లనుంది . అత్యంత భారీ బడ్జెట్ తో ఈ రెండో పార్ట్ ని చిత్రీకరించనున్నారట .  యష్ కు తిరుగులేని స్టార్ డంని అందించింది కేజీఎఫ్ ,మరి ఈ  సీక్వెల్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి .