వార్తలను ఖండించిన కమల్ హాసన్

Published on Feb 09,2019 04:10 PM

భారతీయుడు 2 చిత్రం షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో కమల్ హాసన్ ఎట్టకేలకు స్పందించాడు . భారతీయుడు 2 పై వస్తున్న వార్తలన్నీ గాలి వార్తలేనని కొట్టిపడేసాడు కమల్ హాసన్ . నా ఓల్డ్ గెటప్ లో కొన్ని సమస్యలు వచ్చి ఉండే కానీ అవి తర్వాత  బాగా సెట్ అయ్యాయని అలాగే షూటింగ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతోందని  స్పష్టం చేసాడు కమల్ . 

భారతీయుడు సంచలన విజయం సాధించిన ఇన్నేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ కు శ్రీకారం చుట్టాడు శంకర్ . అయితే గతకొంత కాలంగా శంకర్ నుండి వస్తున్న చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదు . ఇక భారతీయుడు 2 కోసం వేసిన సెట్ శంకర్ మెచ్చలేదంట అలాగే కమల్ గెటప్ లో కూడా తేడా అనిపించడంతో భారతీయుడు 2 షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి .