అర్జున్ రెడ్డి చిత్రంలో జాన్వీ కపూర్

Published on Feb 11,2019 03:30 PM

తెలుగునాట ప్రభంజనం సృష్టించిన చిత్రం అర్జున్ రెడ్డి . ఆ చిత్రాన్ని హిందీలో అలాగే తమిళ్ లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . హిందీలో సజావుగా సాగుతుండగా తమిళ్ లో మాత్రం వర్మ గా రూపొందింది అర్జున్ రెడ్డి చిత్రం . అయితే వర్మ చిత్రాన్ని చూసుకున్నాక అనుకున్న విధంగా సినిమా రాకపోవంతో మళ్ళీ సినిమా మొత్తం రీ షూట్ చేయడానికి సిద్ధమయ్యారు ఆ చిత్ర బృందం . 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది . మేఘ చౌదరి ని ముందుగా హీరోయిన్ గా తీసుకున్నారు కానీ హీరో తప్ప మిగతా అందరినీ మార్చుతున్నారు . అందుకే ఈసారి హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది .