జెర్సీ అంతకు అమ్ముడు పోయిందా ?

Published on Apr 15,2019 04:57 PM

నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రం ఈనెల 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాగా ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులు 4 కోట్లకు అమ్ముడు పోవడం సంచలనం సృష్టిస్తోంది . నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి అంటే ఓవర్ సీస్ లో మిగతా అన్ని పనులు కలుపుకొని వన్ మిలియన్ డాలర్ల షేర్ రాబట్టాలి , వన్ మిలియన్ డాలర్ల షేర్ అంటే మొత్తంగా 2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు సాధించాలి . 

అయితే జెర్సీ అంత వసూల్ చేయగలదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . ఎందుకంటే నాని నటించిన కృష్ణార్జున యుద్ధం , దేవదాస్ చిత్రాలు అక్కడ ప్లాప్ అయ్యాయి . ఇప్పుడు జెర్సీ పై భారీ పెట్టుబడి అంటే బయ్యర్ కు ఇబ్బందే కానీ ధైర్యం చేసి పెట్టాడు . అతడి సొమ్ము తిరిగి వస్తుందా ? లేదా అన్నది ఈనెల 19 న తేలిపోనుంది .