ఫస్ట్ డే అదరగొట్టిన గల్లీ బాయ్

Published on Feb 15,2019 05:57 PM

బాలీవుడ్ చిత్రం గల్లీ బాయ్ మొదటి రోజున 18 కోట్లకు పైగా వసూల్ చేసి అదరగొట్టింది . రణ్ వీర్ సింగ్ - అలియా భట్ లు జంటగా నటించిన గల్లీ బాయ్ నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది . రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ గల్లీ బాయ్ కి ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది . మొదటి రోజున 18.70 కోట్ల వసూళ్ల ని రాబట్టింది గల్లీ బాయ్ . 

గత ఏడాది రణ్ వీర్ సింగ్ నటించిన సింబా సంచలన విజయం సాధించింది . 260 కోట్లకు పైగా వసూళ్ల ని సాధించింది . పైగా దీపికా ని పెళ్లి చేసుకున్నాడు గత ఏడాది . దాంతో చాలా సంతోషంగా ఉన్నాడు ఈ హీరో . ఇక కొత్త ఏడాది లో కూడా గల్లీ బాయ్ తో మంచి ఓపెనింగ్స్ సాధించాడు రన్ వీర్ సింగ్ .