పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది

Published on Jan 31,2019 05:05 PM

పెళ్లి కాకుండానే తల్లి అయి సంచలనం సృష్టించింది ఏక్తా కపూర్ . ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కూతురు ఈ ఏక్తా కపూర్ అన్న విషయం తెలిసిందే . ఇప్పటి ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు ఏక్తా కపూర్ . బాలీవుడ్ లో పలు సీరియల్ లని నిర్మించిన హాట్ భామ ఏక్తా అయితే ఈ భామ పెళ్లి చేసుకోకుండానే సరోగసి (అద్దె గర్భం ) ద్వారా తల్లి అయ్యింది . 

జనవరి 27 న ఆమెకు పండంటి మగ బిడ్డ పుట్టాడు దాంతో ఏక్తా కపూర్ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తోంది . ఇంతకుముందు ఇదే పద్దతిలో అంటే సరోగసి పద్దతిలోనే హీరో తుషార్ కపూర్ కూడా తండ్రి అయ్యాడు . జితేంద్ర కొడుకు తుషార్ కపూర్ కాగా కూతురు ఏక్తా కపూర్ . తుషార్ హీరోగా పెద్దగా ప్రభావం చూపించలేక పోయాడు కానీ ఏక్తా మాత్రం పలు బ్లాక్ బస్టర్ సీరియల్ లని నిర్మించి సత్తా చాటింది .