గరుడ వేగ సీక్వెల్ చేస్తారట

Published on Mar 13,2019 10:54 AM

డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన గరుడ వేగ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ చేసే పనిలో పడ్డారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు అలాగే హీరో డాక్టర్ రాజశేఖర్. పదేళ్ల కాలం తర్వాత రాజశేఖర్ కు హిట్ నిచ్చిన చిత్రం కావడంతో గరుడ వేగ చిత్రానికి సీక్వెల్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు రాజశేఖర్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యాక సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడనేది డిసైడ్ చేస్తారు. 

రాజశేఖర్ ప్రస్తుతం కల్కి చిత్రంలో నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే నెలలో లేదా జూన్ లో రిలీస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కల్కి చిత్రంపై కూడా రాజశేఖర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన కల్కి టీజర్ కు మంచి స్పందన వచ్చింది.