అల్లు అర్జున్ - అల్లు అరవింద్ ల మధ్య విబేధాలు

Published on Mar 22,2019 03:00 PM

తండ్రీ కొడుకులైన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ - అల్లు అర్జున్ ల మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది . గతకొంత కాలంగా ఈ గుసగుసలు ఫిలిం నగర్ సర్కిల్లో వినిపించాయి కట్ చేస్తే అల్లు అర్జున్ తన సొంత ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేసాడు దాంతో ఈ విబేధాలకు ఊతమిచ్చింది . వయసు రీత్యా కాబోలు లేక మరే ఇతర కారణాలో కానీ తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు వచ్చాయట దాంతో అల్లు అర్జున్ వేరు కుంపటి పెట్టుకున్నాడు . 

కొంతకాలం క్రితం వరకు అల్లు అర్జున్ తండ్రి తో బాగానే ఉన్నాడు కానీ అభిప్రాయబేధాలు రావడంతో సొంత నిర్మాణ సంస్థ పెట్టుకున్నాడు . అయితే ఇవి మరీ తీవ్ర స్థాయిలో అయితే లేవు . కానీ తండ్రితో సంబంధం లేకుండా చిత్ర నిర్మాణం చేయాలనే ఆలోచన చేస్తున్నాడు అల్లు అర్జున్ .