ఈనెల 21న వస్తున్న బూతు సినిమా

Published on Mar 18,2019 04:23 PM

ఈనెల 21న బూతు సినిమా '' చీకటి గదిలో చితక్కొట్టుడు '' రిలీజ్ కానుంది . అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ ఇబ్బందుల్లో చిక్కుకుంది . అయితే ఆ ఇబ్బందులను అధిగమించి ఎట్టకేలకు రిలీజ్ కి సిద్ధమైంది . ఇప్పటికే ట్రైలర్ , టీజర్ లతో యువతని విపరీతంగా ఆకర్షించింది చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రం . 

అరుణ్ అదిత్ , నిక్కీ తంబోలి జంటగా నటించారు ఈ చిత్రంలో . నిక్కీ తంబోలి శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది . ఫుల్లుగా అందాలను ఆరబోసి యువతని పిచ్చెక్కించింది నిక్కీ . ఇక అరుణ్ అదిత్ ఈ సినిమాలో నటించడం నా అదృష్టం అని అంటున్నాడు . ఎందుకంటే ఇది అడల్ట్ సినిమా కాబట్టి చాలామంది ఈ సినిమా చేయొద్దని అన్నారట కానీ అందరి సూచనలను పక్కన పెట్టి ఈ సినిమా చేసాడట .