బిగ్ బాస్ 3 లిస్ట్ అంటూ ప్రచారం

Published on Jan 07,2019 02:50 PM

తెలుగులో బిగ్ బాస్ రెండు సీజన్ లు కూడా సక్సెస్ అయ్యాయి దాంతో మూడో సీజన్ కు సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు . బిగ్ బాస్ 1 కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా బిగ్ బాస్ 2 కి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించాడు . ఇక ఇప్పుడేమో బిగ్ బాస్ 3 కి వెంకటేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు అని వినిపిస్తోంది . హిందీ  స్థాయిలో కాకపోయినా తెలుగులో కూడా బిగ్ బాస్ కు మంచి పేరే వచ్చింది , దాంతో మూడో సీజన్ పై అంచనాలు పెరిగాయి . ఇక తాజాగా బిగ్ బాస్ 3 లో పాల్గొనబోయేది వీళ్ళే అంటూ ఓ లిస్ట్ ప్రచారంలోకి వచ్చింది . ఆ లిస్ట్ లో ఉన్న సెలబ్రిటీ లు ఎవరో ఒకేసారి చూద్దామా ! 

రేణు దేశాయ్ ,  వెబ్ మీడియా జ్యోతి ,శోభిత ధూళిపాళ ,జబర్దస్త్ పొట్టి గణేష్ ,ఉదయభాను ,జాకీ టివి ఆర్టిస్ట్ ,వరుణ్ సందేశ్ ,జాహ్నవి ,చైతన్య కృష్ణ ,మనోజ్ నందన్ , కమల్ కామరాజు , నాగ పద్మిని ,రఘు మాస్టర్ ,హేమ చంద్ర ,గద్దె సింధూర , అయితే పేర్లు ఇలా బయటకు వచ్చాయి కానీ వీళ్ళలో ఎంతమంది ఉంటారో ? ఎంతమంది కట్ అవుతారో తెలీదు ఎందుకంటే బిగ్ బాస్ అంటే 90 రోజుల అగ్రిమెంట్ కాబట్టి , అలాగే రెమ్యునరేషన్ తదితర విషయాల వల్ల కూడా మార్పులు చేర్పులు ఉంటాయి మరి .