మలైకా పెళ్లి గురించి మాజీ మొగుడు ఏమన్నాడంటే

Published on Apr 02,2019 03:54 PM

45 ఏళ్ల వయసులో కూడా మిసమిసలాడే మిస్సందంతో బాలీవుడ్ కుర్ర హీరో అర్జున్ కపూర్ ని తన వలలో పడేసుకున్న భామ మలైకా అరోరా . సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చిన తర్వాత అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తోంది . ఇక ఏప్రిల్ 19 న మలైకా అరోరా - అర్జున్ కపూర్ లు పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మలైకా మాజీ మొగుడు అర్భాజ్ ఖాన్ మలైకా పెళ్లి గురించి స్పందించాడు . 

మీరు ఈ ప్రశ్న నన్ను అడగడానికి చాలా ఆలోచించి అడిగి ఉంటారు కానీ నేను కూడా బాగా ఆలోచించి తర్వాత చెబుతాను అంటూ అసలు సమాధానాన్ని దాటవేశాడు అర్భాజ్ ఖాన్ . మలైకా - అర్భాజ్ ఖాన్ లది దాదాపు 19 ఏళ్ల కాపురం , ఆ కాపురానికి గుర్తుగా 14 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు . కానీ అర్భాజ్ తో తనకు ఇక కుదరదని భావించిన మలైకా అరోరా అర్జున్ కపూర్ ని ఈనెల 19 న పెళ్లి చేసుకోనుంది .