నాగార్జున కు థాంక్స్ చెబుతున్న భామ

Published on Mar 14,2019 10:21 AM

కింగ్ నాగార్జున వల్లే నేను ఇక్కడ ఉన్నాను అంటూ మన్మథుడు నాగార్జున కు కృతఙ్ఞతలు తెలుపుతోంది అందాల భామ అనుష్క . 14 ఏళ్ల క్రితం అనుష్క సూపర్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన విషయం తెలిసిందే . నాగార్జున హీరోగా నటించిన సూపర్ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాడు దాంతో నాగార్జున , పూరి జగన్నాధ్ లకు థాంక్స్ చెబుతోంది అనుష్క. 

సూపర్ చిత్రం తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అరుంధతి చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డం అందుకుంది అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు విజయశాంతి తర్వాత అంతటి ప్రాముఖ్యతని సంతరించుకుంది . సైజ్ జీరో చిత్రంలో పాత్ర కోసం లావుగా మారిన అనుష్క ఇప్పుడు తగ్గుతోంది . భాగమతి సినిమా తర్వాత మరో సినిమా చేయడానికి చాలాకాలం సమయం తీసుకున్న ఈ భామ తాజాగా సైలెన్స్ అనే సినిమాలో నటించడానికి రెడీ అవుతోంది.