70 కోట్ల టాక్స్ కట్టిన అమితాబ్ బచ్చన్

Published on Apr 13,2019 03:34 PM

ఇండియన్  మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ 70 కోట్ల టాక్స్ కట్టినట్లు అమితాబ్ ప్రతినిధి పేర్కొనడం సంచలనం కలిగిస్తోంది . అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ అయినప్పటికీ ఇప్పుడు హీరోగా నటించడం లేదు అన్న విషయం తెలిసిందే . హీరోగా నటించకపోయినప్పటికీ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు . ముఖ్య పాత్రల్లో నటించడమే కాకుండా దేశ వ్యాప్తంగా పలు కమర్షియల్ యాడ్స్ లలో నటిస్తున్నాడు . 

కమర్షియల్ యాడ్స్ రూపంలో బాగానే డబ్బు గడిస్తున్నాడు అమితాబ్ అలాగే పలు చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తూ బాగానే సొమ్ము చేసుకుంటున్నాడు . అలా భారీ మొత్తంలో డబ్బులు వస్తుండటంతో 2018 - 19 ఆర్ధిక సంవత్సరానికి గాను 70 కోట్ల ఆదాయపు పన్ను కట్టాడు అమితాబ్ .