ఏబీసీడీ ట్రైలర్ టాక్

Published on Apr 15,2019 02:23 PM

అల్లు శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ చిత్ర ట్రైలర్ ని ఈరోజు దర్శకులు త్రివిక్రమ్ విడుదల చేశారు . రుక్సార్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు . మలయాళంలో హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసారు . ఇక ఈ చిత్రాన్ని మే 17 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . దాంతో ఈరోజు ఏబీసీడీ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసారు . 

ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది . ప్రేమ , హాస్యం , యాక్షన్ లతో కూడుకున్నది దాంతో తప్పకుండా ఏబీసీడీ చిత్రం హిట్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది . ట్రైలర్ బాగుంది , అదే స్థాయిలో సినిమా ఉంటే అల్లు శిరీష్ కు విజయం తప్పకపోవచ్చు . ఇక అల్లు శిరీష్ హీరోగా అయితే పరిచయం అయ్యాడు కానీ కమర్షియల్ హిట్ అయితే కొట్టలేకపోయాడు ఇప్పటివరకు . దాంతో ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు పాపం .