నాని తో రొమాన్స్ చేయనున్న అదితి రావ్ హైదరీ

Published on Mar 13,2019 03:40 PM

న్యాచురల్ స్టార్ నాని తాజాగా మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట . తనని హీరోగా పరిచయం చేసిన గురుతుల్యులు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నాని . మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన అష్టా చెమ్మా చిత్రంతో నాని హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే . అలాగే జెంటిల్ మెన్ అనే మరో హిట్ చిత్రం కూడా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చింది . 

ఇక ఇప్పుడేమో చేయబోయే సినిమాలో బాలీవుడ్ భామ అదితిరావ్ హైదరీ నాని తో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది . అదితిరావ్ హైదరీ ఇంతకుముందు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సమ్మోహనం చిత్రంలో నటించింది . ఆ సినిమా మంచి పేరు తెచ్చింది . దాంతో మళ్ళీ తన తదుపరి చిత్రంలో ఈ భామని ఎంపిక చేసాడట దర్శకుడు . గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని కంప్లీట్ చేసాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది .