ఎన్టీఆర్ సినిమాని రిజెక్ట్ చేసిన లయ

Published on Apr 13,2019 04:03 PM

సీనియర్ హీరోయిన్ లయ ని ఎన్టీఆర్ సినిమాలో నటించాల్సిందిగా ఆఫర్ ఇస్తే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసిందట ! అంతేకాదు ఈ విషయాన్ని లయ స్వయంగా వెల్లడించింది . ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరైనా తప్పకుండా నటిస్తారు కానీ లయ మాత్రం ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా ....... వయసు మళ్ళిన పాత్ర కావడమే ! ఇంతకీ లయ రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్ సినిమా ఏంటో తెలుసా ....... 

అరవింద సమేత వీర రాఘవ చిత్రం . ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత చిత్రంలో ఈశ్వరి రావు అనే నటి పాత్రకు మొదట లయ ని అనుకున్నారట ! అయితే ఆ పాత్ర మరీ వయసు మళ్ళిన పాత్ర కావడంతో నేను పెళ్లి చేసుకొని నటనకు దూరం అయ్యాను కానీ మరీ అంత పెద్దదాన్ని కాదు అందుకే అరవింద సమేత చిత్రాన్ని తిరస్కరించానని చెప్పింది . 

అంతేనా నేను నటనకు దూరం కాలేదు , మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని అంటోంది లయ .1999లో రిలీజ్ అయిన  స్వయం వరం చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది లయ. ఆ తర్వాత హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది . 2006 లో పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడింది .