నిహారిక పెళ్లి చేస్తానంటున్న నాగబాబు

Published on Feb 11,2019 04:34 PM

మెగా డాటర్ నిహారిక పెళ్లి చేస్తానంటున్నాడు నాగబాబు . నిహారిక కు సినిమాలంటే ఎంతో ఇష్టం అందుకే సినిమాల్లో నటిస్తానంటే ఒప్పుకున్నాను అలాగే సినిమాల్లో నటించే ముందు నాలుగేళ్ళ తర్వాత పెళ్లి చేస్తామని ఖచ్చితంగా చెప్పమని అలా నాలుగేళ్లు పూర్తయ్యింది అందుకే పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్నాడు అంతేకాదు మంచి అబ్బాయి ఉంటే కులం , మతం పట్టింపు లేకుండా పెళ్లి చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసాడు నాగబాబు . 

నిహారిక ఇంట్లో ఒప్పించి హీరోయిన్ అయ్యింది అయితే నిహారిక నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి . తాజాగా మరో సినిమా చేస్తోంది సూర్యకాంతం అని . ప్రస్తుతం అబ్బాయిలను వెతుకుతున్నారట నిహారిక కోసం , అబ్బాయి దొరికితే ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది నిహారిక పెళ్లి అవ్వడం ఖాయం అన్నమాట .