ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో,రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఏసిన ఎత్తులు ఈసారి పనిచేయడం లేదు. జనసేన తో దోస్తీ కడదామని చుసిన చంద్రబాబు కి భంగపాటు ఎదురయింది.జనసేన వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గానే బరిలోకి దిగుతోంది అని తెలిసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఉన్న ప్రజాదరణ దృష్ట్యా 25 నుండి 35 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని బావిస్తుంన్నారు.దీనిని బట్టి చుస్తే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్.మరి జనసేన ఈఎన్నికలలో ఎటువంటి పాత్ర పోషిస్తుందో తెలియాలి అంటే ఎన్నికల వారికి వేచి చుడండి.
Read Moreతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మీడియా ముందుకు వచ్చి తన ప్రత్యర్థి ఏపీ సీఎం చంద్రబాబు ఫై విమర్శనా అస్త్రాలు సందించారు .ప్రెస్ మీట్ లోని అంశాలు :చంద్రబాబంతా డర్టీయస్ట్ పోలిటిషియన్ ఇవాళ దేశంలో ఎవరూ లేదు. నవీన్ పట్నాయక్ ను ఎందుకు కలిశావు ఎల్లయ్యను ఎందుకు కలిశావు - మల్లయ్యను ఎందుకు కలిశావు. అని అడుగుతున్నారు అవన్నీ ఆయనకేం అవసరం? నాలుగేళ్లు మోదీసంకలో ఉన్నావు. అప్పుడు మేం మోదీని పొగడాలా. ఇప్పుడు నువ్వు రాహుల్ సంకలోకి ఎక్కగానే, మేమూ కాంగ్రెస్ వెంబడి రావాలా, రాహుల్ గాంధీ విజయవాడ వస్తున్నాడంటే ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడని ప్రశ్నించాడు. నిన్న నరేంద్ర మోదీ వస్తున్నాడంటే ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడని మాట్లాడుతున్నాడు. అసలు నీదేం మొఖం నాకర్థం కాదుబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ ను భరిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేతులెత్తి మొక్కాలి. ఎన్ని పచ్చి అబద్ధాలు! సిగ్గుపడాలి చంద్రబాబు! చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు పేలుతున్నాడు. ఆయన నోటికి మొక్కాలి. రాష్ట్రం విడిపోయి అయిదేళ్లు అయ్యింది. మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ నాయకుడైనా వాళ్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ల హైకోర్టు వాళ్ల దగ్గరకు మార్చుకోవాలి. ఈ అడ్డగోలు మాటలకు ఏమైనా అర్థముందా? . దానికి ఒకటి రెండు పత్రికలు బాకా కొట్టడం! ప్రతి రోజూ ఇదే జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలలో ఇదో పెద్ద డ్రామా అయిపోయిందిచంద్రబాబు యూజ్ అండ్ త్రోలో నంబర్ వన్. మొన్న అమాయకురాలైన హరికృష్ణ బిడ్డ ను నిలబెట్టాడు. ఇప్పుడేమైనా న్యాయం చేస్తావా ఆ అమ్మాయికి? ఏమీ చేయడు. ఎన్నికల ముందు వాడుకోవాలి అంతే!చంద్రబాబుకు నాలుగు వాక్యాలు చక్కగా ఇంగ్లిష్ లో మాట్లాటం వస్తుందా? రెండు సెంటెన్స్ లు హిందీలో మాట్లాడటం వస్తుందా? ఇక... ఢిల్లీలో చక్రం ఎలా తిప్పాలి? అంతా ఒట్టిదే.. డొల్ల. చక్రం లేదు - చింపింది లేదు. చచ్చింది లేదు!
Read Moreతెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టి ఆర్ స్ అధ్యక్షుడు , ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర రావు మంత్రివర్గాన్ని విస్తరించే పనిలో పడ్డారు. రేపు(డిసెంబర్ 30) కానీ - జనవరి మొదటి వారంలో కాని మంత్రివర్గాన్ని విస్తరించే పని చేపడతారని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. ఈ క్యాబినెట్ లో 18 మందికి చోటు దక్కనుంది అని సమాచారం . తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల వైపు శ్రద్ధ పెట్టేందుకు పార్టీ పగ్గాలను తన కుమారుడు కే టి ర్ కి అప్పగించారు. ఆయన కూడా పార్టీని పటిష్టం చేసే పనిని ప్రారంభించారు. గత క్యాబినెట్ లో మహిళలకు ఒక్క మంత్రి పదవి కూడా దక్కలేదు. కేవలం డిప్యూటీ స్పీకర్ పదవిని మాత్రమే ఇచ్చారు. దీంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఈసారి మంత్రి వర్గంలో మహిళలకు కచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గంలోని సీనియర్లను తీసుకోకుండా యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. ముఖ్యమంత్రి - హోమంత్రి కలిపి ఇద్దరు మంత్రులున్నారు. ఇక మిగిలిన 16 మంత్రిపదవులు ఎవరిని వరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
Read Moreతెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుని కలిసి ఎన్టీఆర్ పిచ్చ షాక్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు కి అలాగే బాబాయ్ బాలకృష్ణ కు. ఇటీవలే తెలంగాణలో అసెంబ్లీ కి ఎన్నికలు జరుగగా కూకట్ పల్లి నుండి నందమూరి సుహాసిని తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యింది. అక్క కోసం ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు. దాంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ పై ఆగ్రహం గా ఉన్నారు. ఇక ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్ కేటీఆర్ ని ఓ ఫంక్షన్లలో కలవడం సంచలనం సృష్టిస్తోంది. ఎన్టీఆర్ కేటీఆర్ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అక్క కోసం ప్రచారం చేయడం ఇష్టం లేని తమ్ముడు ప్రత్యర్థి పార్టీ నాయకుడితో మాత్రం కలిసి ఫోటో దిగడం ఏంటి ? అని విమర్శిస్తున్నారు నెటిజన్లు. అయితే ఎన్టీఆర్ పై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం ఎన్టీఆర్ నే సమర్దిస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో అప్పట్లో చురుగ్గా పాల్గొన్నాడు కానీ చంద్రబాబు వ్యవహారం వల్ల ఎన్టీఆర్ చాలాకాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
Read Moreహీరో ప్రభాస్ గెస్ట్ హౌజ్ ని సీజ్ చేసి అతడికి షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం . శేరిలింగం పల్లి రాయదుర్గం లోని 46 సర్వే నెంబర్ లో 2200 గజాల స్థలంలో ప్రభాస్ తన గెస్ట్ హౌజ్ కట్టుకున్నాడు . అయితే ఈ కట్టడం అక్రమమని అంతేకాకుండా అది ప్రభుత్వ స్థలమని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకేకింది . కోర్టు తీర్పు ప్రకారం ప్రభాస్ కట్టుకున్న గెస్ట్ హౌజ్ ప్రభుత్వ స్థలమని తేల్చి చెప్పింది . దాంతో కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభాస్ గెస్ట్ హౌజ్ ని సీజ్ చేసారు అధికారులు . ప్రభాస్ గెస్ట్ హౌజ్ కు తాళాలు వేయడమే కాకుండా సీజ్ చేసి నోటీసులు అంటించారు . ప్రభుత్వ అధికారులు నోటీసులు అంటించారు కాబట్టి గెస్ట్ హౌజ్ ఇక అధికార్ల అధీనంలో ఉండనుంది . అయితే కొద్దికాలం క్రితమే రెగ్యులరైజ్ చేయమని ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు ప్రభాస్ . మరి తెలంగాణ ప్రభుత్వం ప్రభాస్ పట్ల సానుకూలంగా స్పందించి రెగ్యులరైజ్ చేస్తుందా ? లేక అక్రమ కట్టడం అని కూల్చుతుందా చూడాలి .
Read Moreఉత్తరప్రదేశ్ లోని ఓ న్యూస్ ఛానల్ లో పనిచేసే యాంకర్ రాధికా కౌశిక్ ఆత్మహత్య సంచలనం సృష్టిస్తోంది . న్యూస్ యాంకర్ రాధికా కౌశిక్ - మరో యాంకర్ రాహుల్ ఇద్దరూ కొంతకాలంగా నోయిడా లోని అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకొని సహజీవనం చేస్తున్నారు . కాగా నిన్న ఉదయం నుండి జాబ్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ ఇద్దరు కూడా మద్యం సేవించారు . అయితే మద్యం మత్తులో ఉన్న సమయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో నాలుగో అంతస్థు నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది రాధికా కౌశిక్ . ఈ విషయాన్నీ పోలీసులకు అక్కడి వాచ్ మెన్ ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు రాహుల్ ని అరెస్ట్ చేసి తమ అదుపులో ఉంచుకున్నారు . నేను బాత్ రూంలోకి వెళ్లిన సమయంలో రాధికా ఆత్మాహత్య చేసుకుందని అందుకే ఆమెని కాపాడలేక పోయానని చెబుతున్నాడు రాహుల్ . రాధికా కౌశిక్ ఆత్మహత్య చేసుకుందా ? లేక హత్య చేసారా ? అన్న కోణం లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు . రాధికా - రాహుల్ పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్నారు .
Read Moreఅక్క నందమూరి సుహాసిని కూకట్ పల్లి లో ఓడిపోవడంతో ఎన్టీఆర్ కుమిలి కుమిలి పోతున్నాడట. అక్క నందమూరి సుహాసిని తెలంగాణ ఎన్నికల్లో కూకట్ పల్లి నుండి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి ప్రయోజనం ఉండదని పైగా తండ్రి హరికృష్ణ మరణించిన ఈ సమయంలో అస్సలు మంచిది కాదని ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశాడట. కానీ ఎన్టీఆర్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో విభేదించిన చంద్రబాబు పట్టుబట్టి మరీ సుహాసిని ని కూకట్ పల్లి బరిలో దించారు. కట్ చేస్తే ఘోరంగా ఓడిపోయింది సుహాసిని దాంతో ఎన్టీఆర్ కోపంతో ఊగిపోతున్నాడట . నాన్న చనిపోవడం , అక్క ఓడిపోవడంతో ఎన్టీఆర్ తో పాటుగా నందమూరి కుటుంబం షాక్ కి గురయ్యిందట.
Read Moreఈరోజుల్లో చిత్రంతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన భామ రేష్మ . మారుతి దర్శకత్వం వహించిన ఈరోజుల్లో చిత్రంలో హీరోయిన్ గా నటించిన రేష్మ తెలంగాణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ స్థానం నుండో పోటీ చేసింది . అయితే భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేసి దారుణంగా ఓడిపోయింది . ఈ భామకు సమాజసేవ చేయాలనే ఆశ ఉండేది దాంతో రాజకీయాల్లోకి వెళ్ళింది . అయితే మరో పార్టీ నుండి పోటీ చేసి ఉంటే ఎలా ఉండేదో కానీ ఏమాత్రం బలం లేని భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేసి దారుణంగా ఓడిపోయింది . ఈరోజుల్లో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే . ఆ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించింది కానీ అవేవి ఈ భామకు కెరీర్ పరంగా ఉపయోగపడలేదు . దాంతో సినిమాలు పక్కన పెట్టి రాజకీయాల్లోకి రావాలని బిజెపి లో చేరింది దెబ్బతింది . దాంతో రెంటికి చెడిన రేవడిలా తయారయ్యింది రేష్మ పరిస్థితి .
Read Moreరెండోసారి తెలంగాణ రాష్ట్రంలో విజయ పతాకాన్ని ఎగురవేసిన టి.ఆర్.ఎస్. అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావును మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అభినందించింది. అందరి అంచనాలను మించి అఖండ విజయాన్ని రెండోసారి కూడా సాధించిన ఘనత కె.సి.ఆర్.కు దక్కిందని 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. టి.ఆర్.ఎస్. ప్రభుత్వం చిత్రసీమ అభివృద్ధి కోసం ఎంతో కట్టుబడి ఉందని, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారిని, ఎఫ్.డి.సి. ఛైర్మన్ రామ్మోహనరావు గారిని ఎప్పుడు ఏ పని నిమిత్తం కలిసినా ఎంతో సహకరించారని ఆయన చెప్పారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ రజతోత్సవ సంవత్సరం సందర్భంగా తమ ముందు ఓ పెద్ద బాధ్యత ఉందని, గోల్డేజ్ హోమ్ నిర్మాణాన్ని ఈ కార్యవర్గం ఉండగానే ప్రారంభించాలను కుంటున్నామని శివాజీరాజా తెలిపారు. అందుకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు, కె.టి.ఆర్., హరీశ్ రావు, కవిత, తలసాని శ్రీనివాస యాదవ్ గార్ల సహకారం లభిస్తుందని భావిస్తున్నామని అన్నారు. ఒకసారి మాట ఇస్తే దాని మీద నిలబడే వ్యక్తి కేసీఆర్ అని, ఆ నమ్మకం తమకు ఉందని శివాజీరాజా అన్నారు. త్వరలోనే ఈ విషయమై కేసీఆర్ గారిని కలుస్తామని, తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'గోల్డ్ ఏజ్ హోమ్'ను ఆయన సహకారంతో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యంగా సిద్ధిపేటను అత్యంత ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దిన హరీశ్ రావును శివాజీ రాజా అభినందించారు. ఆ అభివృద్ధి కారణంగానే అక్కడి ప్రజలు లక్ష ఓట్లకు మైగా మెజారిటీని ఆయనకు అందించారని అన్నారు.ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పిన ఫిగర్ ను రీచ్ కావడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, చెప్పి మరీ కేసీఆర్ మ్యాజిక్ ఫిగర్ ను దాటి భారీ మెజారిటీ సాధించారని 'మా' కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. సినీ ప్రముఖుల సహకారంతో, ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ లో గోల్డ్ ఏజ్ హోమ్ ను ప్రారంభించాలను కుంటున్నామని, తెలంగాణ ప్రభుత్వం సైతం తమ వంతు సహకారం అందిస్తుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. పది పదిహేను సంవత్సరాలపాటు పోరాడి ప్రత్యేక రాష్ట్రంను సాధించిన నాయకుడు కేసీఆర్ అని, ఆయన నాయకత్వం మీద నమ్మకంతోనే రెండోసారి కూడా టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారని, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరినీ కేసీఆర్ బాగా చూసుకుంటారని బెనర్జీ తెలిపారు. గడిచిన నాలుగున్నర యేళ్ళకు మించిన అభివృద్దిని రాబోయే ఐదేళ్ళలో కేసీఆర్ చేస్తారనే నమ్మకం తనకుందని ఆయన అన్నారు. రెండోసారి కూడా భారీ మెజారిటీతో, భారీ సీట్లను టి.ఆర్.ఎస్. పొందడం ఆనందంగా ఉందని, ముఖ్యంగా తలసాని శ్రీనివాస యాదవ్, మాగంటి గోపీనాథ్ వంటి సినిమా వారు గెలవడం సంతోషంగా ఉందని ఏడిద శ్రీరామ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న కేసీఆర్ కు సురేశ్ కొండేటి శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్, మాగంటి గోపీనాథ్ వంటి వారి సహకారంతో చిత్రసీమ మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Read Moreతెలంగాణలో కేసీఆర్ దే హవా అని మరోసారి తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో నిరూపించారు . డిసెంబర్ 7న తెలంగాణలో పోలింగ్ జరుగగా ఈరోజు ఫలితాలు వెలువడుతున్నాయి . ఇక ఏకపక్షంగా ఫలితాలు వస్తుండటంతో కాంగ్రెస్ - టీడీపీ కూటమి కళ్ళు బైర్లు కమ్మాయి . కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందుతుండటంతో అసలు ఏం మాట్లాడాలో తెలీక ముఖం చాటేస్తున్నారు . కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి దాదాపు 90 నియోజకవర్గాల్లో దూసుకుపోతోంది . పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తున్నాడు కేసీఆర్ . తెలంగాణలో అన్ని చోట్లా కేసీఆర్ కు బ్రహ్మరథం పడుతున్నారు . తెలంగాణ లో ఇతర చోట్లా మాత్రమే కాదు హైదరాబాద్ నగరంలో కూడా టీఆర్ఎస్ కు అత్యధికంగా ఓట్లు రావడం సంచలనంగా మారింది . మొత్తానికి ఈ ఎన్నికల్లో కేసీఆర్ వర్సెస్ కూటమి గా మారింది తప్ప ఇతర అభ్యర్థులు కాదని స్పష్టం అయ్యింది .
Read Moreతెలంగాణ ఎన్నికల ఫలితాలలో టి ఆర్ స్ మొదటి బోణి కొట్టింది.ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ గెలుపొందారు.సమీప ప్రత్యర్థిఫై భారీ ఆధిక్యం తో గెలిచారు. అన్నిచోట్లా టి ఆర్ స్ అభ్యర్థులు ముందుజా లో ఉన్నారు
Read Moreతెలంగాణలో తొలి ఫలితం విడుదల ఇది .హైదరాబాద్ లోని చాంద్రాయణ గుట్ట నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ గెలుపొందారు.ఎంఐఎంకు బలమైన నియోజకవర్గంగా చాంద్రాయణ గుట్ట ఉంది. టీ ఆర్ ఎస్ మాత్రం స్నేహపూర్వక పోటీలో భాగంగా బలహీన అభ్యర్థిని పెట్టింది. తొలి విజేతగా అక్బరుద్దీన్ నిలిచారు.
Read Moreలగడపాటి సర్వే : జిల్లాల వారీగా గెలిచే అభ్యర్థులు వీళ్ళే నటఆదిలాబాద్ జిల్లాలోసిర్పూర్ – పాల్వాయి హరీష్ (కాంగ్రెస్)ఖానాపూర్- రాథోడ్ రమేష్ (కాంగ్రెస్)బెల్లంపల్లి- దుర్గం చిన్నయ్య (టీఆర్ఎస్)చెన్నూరు- వెంకటేశ్ నేత బోర్లకుంట (కాంగ్రెస్)మంచిర్యాల- కొక్కిరాల ప్రేమసాగర్ రావు (కాంఠగ్రెస్)నిర్మల్- ఇంద్రకరణ్ రెడ్డి (టీఆర్ఎస్)బోథ్- బాపూరావు రాథోడ్ (టీఆర్ఎస్)ముథోల్- విఠల్ రెడ్డి (టీఆర్ఎస్)ఆసిఫాబాద్- ఆత్రం సక్కు (కాంగ్రెస్)ఆదిలాబాద్- సుజాత గండ్రత్ (కాంగ్రెస్)కరీంనగర్కోరుట్ల- కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (టీఆర్ఎస్)జగిత్యాల- జీవన్ రెడ్డి (కాంగ్రెస్)ధర్మపురి- కొప్పుల ఈశ్వర్ (టీఆర్ఎస్)మంథని- దుద్దిళ్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్)రామగుండం- కోరుకంటి చందర్ (ఇండిపెండెంట్ )పెద్దపల్లి- విజయరమణరావు (కాంగ్రెస్)కరీంనగర్-పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్)చొప్పదండి- రవిశంకర్ (టీఆర్ఎస్)వేములవాడ- చెన్నమనేని రమేష్ (టీఆర్ఎస్)సిరిసిల్ల- కె.తారకరామారావు (టీఆర్ఎస్)మానకొండూరు- ఆరేపల్లి మోహన్ (కాంగ్రెస్)హుజురాబాద్- ఈటల రాజేందర్ (టీఆర్ఎస్)హుస్నాబాద్- ఒడితల సతీష్ (టీఆర్ఎస్)నిజామాబాద్ఆర్మూరు- ఆకుల లలిత (కాంగ్రెస్)బాల్కొండ- వేముల ప్రశాంత్ రెడ్డి (టీఆర్ఎస్)బోధన్- పి.సుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్)నిజామాబాద్ అర్బన్- బిగాల గణేష్ గుప్తా (టీఆర్ఎస్)నిజామాబాద్ రూరల్- రేకుల భూపతిరెడ్డి (కాంగ్రెస్)బాన్సువాడ- బాల్ రాజ్ (కాంగ్రెస్)జుక్కల్- గంగారం (కాంగ్రెస్)కామారెడ్డి- షబ్బీర్ అలీ (కాంగ్రెస్)ఎల్లారెడ్డి- సురెందర్ (కాంగ్రెస్)మెదక్నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి (కాంగ్రెస్)నారాయణ్‌ఖేడ్- భూపాల్ రెడ్డి (టీఆర్ఎస్)సంగారెడ్డి- జయప్రకాశ్ రెడ్డి (కాంగ్రెస్)ఆందోల్- దామోదర రాజనర్సింహ (కాంగ్రెస్)జహీరాబాద్- మాణిక్ రావు (టీఆర్ఎస్)పటాన్చెరువు -మహిపాల్ రెడ్డి (టీఆర్ఎస్)దుబ్బాక- సోలిపేట రామలింగారెడ్డి (టీఆర్ఎస్)గజ్వెల్- వంటేరు ప్రతాప్ రెడ్డి (కాంగ్రెస్)సిద్దిపేట- టి.హరీష్ రావు (టీఆర్ఎస్)మెదక్- పద్మదేవేందర్ రెడ్డి (టీఆర్ఎస్)వరంగల్వరంగల్ తూర్పు- రవిచందర్ (కాంగ్రెస్)వరంగల్ పశ్చిమ- దాస్యం వినయ్‌భాస్కర్ (టీఆర్ఎస్)ములుగు- డి.అనసూయ (కాంగ్రెస్)భూపాలపల్లి-జి.వెంకటరమణారెడ్డి (కాంగ్రెస్)జనగం- పొన్నాల లక్ష్మయ్య (కాంగ్రెస్)పాలకుర్తి- ఎర్రబెల్లి దయాకర్ రావు (టీఆర్ఎస్)వర్దన్నపేట- ఆరూరి రమేష్ (టీఆర్ఎస్)పరకాల- కొండా సురేఖl (కాంగ్రెస్)నర్సంపేట- దొంతి మాధవ్ రెడ్డి (కాంగ్రెస్)డోర్నకల్- జాటోత్ రామచంద్రు నాయక్ (కాంగ్రెస్)ఘన్ పూర్- సింగపూర్ ఇందిర (కాంగ్రెస్)మహబాబూబాద్- బలరాం నాయక్ (కాంగ్రెస్)మహబూబ్నగర్గద్వాల- డి.కె.అరుణ (కాంగ్రెస్)కల్వకుర్తి- వంశీచంద్ రెడ్డి (కాంగ్రెస్)కోడంగల్- రేవంత్ రెడ్డి (కాంగ్రెస్)అలంపూర్- సంపత్ కుమార్ (కాంగ్రెస్)కొల్లాపూర్- జూపల్లి క్రిష్ణారావు (టీఆర్ఎస్)మహబూబ్‌నగర్- శ్రీనివాస్ గౌడ్ (టీఆర్ఎస్)నారాయణ్‌పేట్- రాజేందర్ రెడ్డి (టీఆర్ఎస్)నాగర్ కర్నూల్- నాగం జనార్దన్ రెడ్డి (కాంగ్రెస్)వనపర్తి- జి.చిన్నారెడ్డి (కాంగ్రెస్)అచ్చంపేట- గువ్వల బాలరాజు (టీఆర్ఎస్)మక్తల్- చిట్టం రామ్మోహన్ రెడ్డి (టీఆర్ఎస్)దేవరకద్ర- డాక్టర్ పవన్ కుమార్‌రెడ్డి (కాంగ్రెస్)షాద్‌నగర్-ప్రతాప్ (కాంగ్రెస్)జడ్చర్ల- మల్లు రవి (కాంగ్రెస్)నల్గొండకోదాడ- పద్మారెడ్డి (కాంగ్రెస్)హుజూర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)మిర్యాలగూడ- ఆర్.కృష్ణయ్య (కాంగ్రెస్)నాగార్జునసాగర్- కుందూరి జానారెడ్డి (కాంగ్రెస్)దేవరకొండ- బాలూనాయక్ (కాంగ్రెస్)నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్)మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్)నకిరేకల్- వేముల వీరేశం (టీఆర్ఎస్)భువనగిరి- కుంభం అనిల్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)ఆలేరు- బూడిద భిక్షమయ్య గౌడ్ (కాంగ్రెస్)సూర్యపేట- ఆర్.దామోదర్ రెడ్డి (కాంగ్రెస్)తుంగతుర్తి- అద్దంకి దయాకర్ (కాంగ్రెస్)ఖమ్మంపాలేరు- తుమ్మల నాగేశ్వరరావు (టీఆర్ఎస్)మధిర- భట్టి విక్రమార్క (కాంగ్రెస్)సత్తుపల్లి- సండ్ర వెంకటవీరయ్య (టి.డి.పి.)ఖమ్మం- నామా నాగేశ్వర్ రావు (టి.డి.పి)వైర-బానోత్ విజయబాయి (సీపీఐ)భద్రాచలం- మిడియం బాబురావు (సీపీఎం)ఇల్లెందు- బానోత్ హరిప్రియ (కాంగ్రెస్)అశ్వారావుపేట- మెచ్చ నాగేశ్వరరావు (టీడీపీ)పినపాక-రేగ కాంతారావు (కాంగ్రెస్)కొత్త గూడెం- వనమ వెంకటేశ్వరరావు (కాంగ్రెస్)రంగారెడ్డిమేడ్చల్- కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి (కాంగ్రెస్)మల్కాజ్గిరి- మైనంపల్లి హన్మంతరావు (టీఆరఎస్)కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్ (కాంగ్రెస్)కూకట్ పల్లి- నందమూరి సుహాసిని (టి.డి.పి.)ఉప్పల్- భేతి సుభాష్ రెడ్డి (టీఆర్ఎస్)ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్ రెడ్డి (టీఆర్ఎస్)ఎల్బీ నగర్- సుధీర్ రెడ్డి (కాంగ్రెస్)మహేశ్వరం-సబిత ఇంద్రరెడ్డి (కాంగ్రెస్)రాజేంద్రనగర్- ప్రకాష్‌గౌడ్ (టీఆర్ఎస్)శేరిలింగంపల్లి- భవ్యా ఆనంద్ ప్రసాద్ గాంధీ (టి.డి.పి.)చేవెళ్ల- కె.ఎస్.రత్నం (కాంగ్రెస్)పరిగి-మహేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్)వికారాబాద్- గడ్డం ప్రసాద్ (కాంగ్రెస్)తాండూర్- రోహిత్ రెడ్డి (కాంగ్రెస్)హైదరాబాద్ముషీరాబాద్- డాక్టర్.కే.లక్ష్మణ్ (బీ.జే.పి.)మలక్‌పేట- (ఎంఐఎం)అంబర్ పేట- కిషన్ రెడ్డి (బీజేపీ)ఖైరతాబాద్- డాక్టర్ దాసోజు శ్రవణ్ ( కాంగ్రెస్)జూబ్లీహీల్స్- మాగంటి గోపీనాథ్ (టీఆర్ ఎస్)సనత్ నగర్-కూన వెంకటేశ్వర్ గౌడ్ (టి.డి.పి)నాంపల్లి- జాఫర్ హుస్సెన్‌మిరాజ్ (ఎంఐఎం)కార్వాన్- కౌసర్ మొహియుద్దీన్(ఎంఐఎం)గోషామహాల్- ముకేశ్ గౌడ్ (కాంగ్రెస్)చార్మినార్-ముంతాజ్ అహ్మద్ ఖాన్ (ఎంఐఎం)చాంద్రాయణ్‌గుట్ట- అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం)యాకుత్‌పుర- అహ్మద్ పాషా ఖాద్రీ(ఎంఐఎం)బహదూర్ పుర- మహ్మద్ మోజం ఖాన్(ఎంఐఎం)సికింద్రబాద్- కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ (కాంగ్రెస్)కంటోన్మెంట్- సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్)దీని ప్రకారం చూస్తేటీఆర్ఎస్=35కాంగ్రెస్=65ఎంఐఎం=7,బీజేపీ=2,టీడీపీ=6సీపీఐ=1,సీపీఎం=1,ఇండిపెండెంట్=2ఇది లగడపాటి రాజగోపాల్ విడుదల చేసిన సర్వే అంటూ ప్రచారం జరుగుతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతోంది. ఈ సర్వే . అయితే అసలు ఫలితాలు మాత్రం రేపు 11 గంటల కల్లా తెలిసిపోనున్నాయి. తెలంగాణ ఫలితాలు , లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలు నియోజకవర్గస్థాయిలో
Read Moreతెలంగాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యం లో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేసాయి ఆ వివరాలు...తెలంగాణ : మొత్తం స్థానాలు 119టైమ్స్ నౌ సర్వే: టీఆర్ ఎస్- 66 ప్రజాకూటమి- 37 బీజేపీ- 7 ఇతరులు- 9రిపబ్లిక్ సర్వే: టీఆర్ ఎస్ 50-65 ప్రజాకూటమి 38-52న్యూస్ ఎక్స్ సర్వే: టీఆర్ ఎస్- 57 ప్రజాకూటమి- 46 బీజేపీ- 6 ఇతరులు- 10సీఎన్ ఎన్ సర్వే: టీఆర్ ఎస్ 50-65 ప్రజాకూటమి 38-52 బీజేపీ 4-7 ఇతరులు 8-14
Read Moreకొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ని ఈరోజు ఉదయం నాలుగు గంటలకు కొడంగల్ లో అరెస్ట్ చేసారు పోలీసులు . కొడంగల్ లోని ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేసారు దాంతో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి . ఈరోజు కొడంగల్ లో కేసీఆర్ పర్యటన ఉన్నందున ముందస్తు చర్యగా రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేసి జడ్చర్ల కు తరలించారు . కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కొడంగల్ బంద్ కు పిలుపునిచ్చాడు రేవంత్ రెడ్డి . దాంతో ఈ వ్యవహారం పై ఎన్నికల సంఘం సీరియస్ అయి రేవంత్ పై చర్యలు తీసుకోవాల్సిందింగా డిజిపి ని ఆదేశించింది . అయితే రేవంత్ ని అరెస్ట్ చేసిన విధానం ని మాత్రం ప్రజాస్వామ్య వాదులు ఖండిస్తున్నారు . బెడ్ రూమ్ తలుపులు పగులగొట్టి మరీ మహిళలు ఉన్న రూమ్ లోకి పెద్ద ఎత్తున పోలీసులు రావడం మాత్రం అందరూ ఖండిస్తున్నారు . ఇలాంటి చర్యల వల్ల రేవంత్ కు మరింత బలం పెరగడం ఖాయమని అంటున్నారు . రేవంత్ ని మాత్రమే కాకుండా అనుచరులను కూడా అరెస్ట్ చేయడంతో కొడంగల్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .
Read Moreపవన్ కల్యాణ్ అభిమానులు నలుగురు ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ దారుణ సంఘటన కర్నూలు జిల్లా డోన్ సమీపంలో జరిగింది. పవన్ కల్యాణ్ జనసేన తరుపున అనంతపురంలో కవాతు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కవాతులో పాల్గొనడానికి పెద్ద ఎత్తున పవన్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చారు. తమ అభిమాన హీరో నిర్వహిస్తున్న కవాతు లో పాల్గొనడానికి కర్నూలు జిల్లా డోన్ కి చెందిన నలుగురు అభిమానులు కారులో బయలుదేరారు. సభ అనంతరం తిరిగి డోన్ కు వస్తున్న సమయంలో వీళ్ళు ప్రయాణిస్తున్న కారు ని హైదరాబాద్ నుండి వస్తున్న బస్సు వేగంగా వచ్చి గుద్దేయడంతో అక్కడి కక్కడే నలుగురు అభిమానులు చనిపోయారు. జనసేన సభకు వెళ్లి వస్తున్న తరుణంలో ఈ సంఘటన జరగడంతో పవన్ కల్యాణ్ అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. నాలుగు కుటుంబాల రోధనతో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతి వేగమే ఈ ఘోర కలి కి కారణం అని తెలుస్తోంది.
Read Moreటీఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో -ముఖ్యమైన హామీలు1.అన్ని రకాల పెన్షన్లు రూ.1000నుండి రూ.2016లకు పెంపు. వికలాంగులకు పెన్షన్లు రూ.1500నుండి రూ.3016లకు పెంపు2.వృద్దాప్య పెన్షన్ అర్హత 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు.3.నిరోద్యుగులకు నెలకు రూ.3016భృతి4.డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం యధాతదంగ ఉంచారు.దానితోపాటు సొంత ఇంటి స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల నుండి రూ.6లక్షల వరకు సాయం.5.రైతుబంధు పతకం కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సాయాన్ని రూ.8వేల నుండి రూ.10వేలకు పెంపు.6.రైతులకు రూ.1లక్ష వరకు పంట రుణాలు మాఫీ7.రైతు సమన్వయ సమితి లో ఉన్న సభ్యులకు గౌరవ భృతి.8.వివధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనలను ప్రభుత్వం పరిశీలిస్తుంది.9.రెడ్డి, వైశ్య కార్పోరేషన్ తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పోరేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది.10.వివిధ సామాజిక వర్గాల నుంచి కార్పోరేషన్లు ఏర్పాటు చేయాలని వచ్చిన డిమాండ్లను రాబోయే టీఆర్ ఎస్ ప్రభుత్వం పరిశీలించి పరిష్కరిస్తుంది. 11.అగ్రకులాల్లోని పేదల కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశ పెట్టడం జరుగుతుంది.12.రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు.ఐకేపీ ఉద్యోగులను పర్మినెంటు చేసి ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకేపీ ఉద్యోగులకు అప్పగించడం జరుగుతుంది. ఈ యూనిట్లు తయారుచేసే కల్తీ లేని ఆహార పదార్థాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది13.కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. ప్రతీ వ్యక్తి ఆరోగ్య వివరాలను రికార్డు చేసి తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తుంది.14.ప్రభుత్వ ఉద్యోగులను సబబైన సముచితమైన రీతిలో వేతన సవరణ చేస్తుంది15.ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58నుండి 61సం.లకు పెంపు.దీనికి సమాంతరంగా నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించడం కోసం ఉద్యోగాల నియామక వయోపరిమితిని మూడేళ్లు పెంచడం జరుగుతుంది.16.పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.17.అటవీ ప్రాంతాల్లోని గిరిజన మరియు గిరిజనేతర రైతుల భూవివాదాలను వెంటనే పరిష్కరించి వారికీ యాజమాన్య హక్కులను కల్పిస్తుంది. వారికి ఇతర రైతులకు అందిస్తున్న పతక ప్రయోజనాలను అందిస్తుంది.18.బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.19.సింగరేణి భూముల్లో ఇండ్లు కట్టుకున్నప్రతి ఒక్కరికి పట్టాలు ఇస్తుంది.20.హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వీటిని మరింత త్వరగా చేయడం జరుగుతుంది.21.ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుంది.22.చట్ట సభల్లో బీసీలకు 33%,మహిళలకు 33% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం పోరాడుతుంది.23.ఎస్టీలకు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం పోరాడుతుంది.24.ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపి, కేంద్రం నుండి ఆమోదం రావడం కోసం టీఆర్ ఎస్ పోరాటం చేస్తుంది.
Read Moreఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఎన్టీఆర్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది అందుకే అక్క సుహాసిని కూకట్ పల్లి లో పోటీ చేస్తున్నప్పటికీ ప్రచారం చేయడం లేదు. సుహాసిని మాత్రం నా తమ్ముళ్లు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా ప్రచారానికి వస్తారని ఇప్పటికి చాలాసార్లు చెప్పింది కానీ ఎన్టీఆర్ ప్రచారం చేయడం కష్టమే అని తెలుస్తోంది. ఈరోజు డిసెంబర్ 1 అంటే మరో నాలుగు రోజులు మాత్రమే ప్రచారం మిగిలి ఉంది. అయినప్పటికీ ఎన్టీఆర్ వస్తున్నట్లా ? లేదా ? అన్నది ఇంకా తేలలేదు. 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ ని ప్రచారానికి వాడుకున్నాడు చంద్రబాబు , అయితే ఆ ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ ని మాత్రమే కాదు హరికృష్ణ ని కూడా దూరం పెట్టాడు బాబు . దాంతో చంద్రబాబు మీద ఆగ్రహంగా ఉన్నాడు ఎన్టీఆర్ . ఇక తండ్రి చనిపోయి ఉంటే ఇప్పుడేమో అక్కని పోటీకి నిలిపడంతో ఎన్టీఆర్ కు , కళ్యాణ్ రామ్ కు ఇష్టం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రచారానికి వెళ్లలేదనే మాట వినిపిస్తోంది. పైగా చంద్రబాబు అవసరానికి వాడుకొని వదిలేసే రకమని అందుకే అతడు అంటే ఎన్టీఆర్ కు గిట్టడం లేదని సన్నిహితుల వద్ద వాపోయాడట ఎన్టీఆర్.
Read Moreప్రతిభను పరిశ్రమ గుర్తిస్తుంది. గౌరవించి అవకాశాలిస్తుంది.. కాస్త ఆలస్యంగా అయినా వెలుగులోకి వచ్చిన గాయనీమణి బేబి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓ సెన్సేషన్. మెగాస్టార్ చిరంజీవి అంతటి వారే బేబి పాటకు ఫిదా అయిపోయారు. ఆమె పాటను విని సతీ(సురేఖ)సమేతంగా పరవశించుపోయారు. ప్రత్యేకించి తనను ఇంటికి పిలిచి మరీ సన్మానించారు. ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ అంతటి వారే ఆమె పాటకు ఖుదాఫీస్ అన్నారు. తనకు పాడేందుకు అవకాశం కల్పిస్తానని మాటిచ్చారు. వందల చిత్రాలకు సంగీతం అందించిన టాలీవుడ్ సంగీత దర్శకుడు కోటి తాను సంగీతం అందించే ప్రతి సినిమాలో అవకాశాలిచ్చి ప్రోత్సహించేందుకు సిద్ధపడ్డారు. ఒకరేమిటి.. బేబి పాడతానంటే సంగీత దర్శకుల క్యూ రెడీగా ఉందిప్పుడు. `ఓ చెలియా నా ప్రియ సఖియా.. అంటూ గొంతు సవరించింది మొదలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ సెలబ్రిటీ అయిపోయారు బేబి. మట్టిలో మాణిక్యం ... పల్లెకోకిల అంటూ బేబీని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు. బేబి ప్రకంపనాలు ఇప్పట్లో ఆగేట్టు లేవు. ఓవైపు రాజకీయ నాయకులు, మరోవైపు సినీసెలబ్రిటీలు బేబీని కలుస్తున్నారు. అభినందనలతో ముంచెత్తుతున్నారు. తాజాగా మాజీ శాసన సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త టి.వెంకట్రావ్ బేబీని సన్మానించారు. రూ.1,11,111 (లక్ష 11వేల 111రూపాయలు) విరాళం ఇచ్చి .. చీరలు అందజేశారు. ఈ ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో కోటి, గాయని గీతామాధురి, కేథరిన్ థ్రెసా, హీరోయిన్ కారుణ్య (బంగారి బాలరాజు), నటి రంజిత, సింగర్ మధు తదితరులు పాల్గొన్నారు.కోటి మాట్లాడుతూ - ``వాట్సాప్‌లో పాట విని షాకయ్యాను. బేబీకి పుట్టుకతో వచ్చిన ప్రతిభ అది. ఇది ఇన్‌బిల్ట్ ట్యాలెంట్. కీర్తి అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. చిరంజీవి - సురేఖ గారు తన పాట వినాలని ఫోన్ చేస్తే వెంటనే తనని వాళ్ల దగ్గరికి తీసుకెళ్లాను. చిరంజీవి గారు రూ.1లక్ష విరాళం ఇచ్చారు. పాటలు పాడించుకుని విన్నారు. ఏ.ఆర్.రెహమాన్, బాలసుబ్రమణ్యం, జానకమ్మ అందరూ పిలిచి బేబీని ప్రశంసిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. బేబి ఏ పాట పాడినా ఆకట్టుకుంటోంది. 5 డిసెంబర్ తర్వాత రెహమాన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. రఘు కుంచె తొలి పాటను పాడించాడు. బేబి అద్భుతంగా పాడారు. రఘు మ్యూజిక్ బాగా కుదిరింది. రెండో పాటకు నాకు అవకాశమిచ్చారు బేబి. నాకు ఫోక్ మెలోడీ పాటను పాడబోతున్నారు. పరిశ్రమ సంగీత దర్శకులంతా తనతో పాడించుకోవాలి. చదువు లేదు. కేవలం సంగీతం మాత్రమే తనని ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేను కొన్ని మెళకువలు చెబుతున్నా. బేబికి అమెరికా, దుబాయ్ నుంచి పిలుపొచ్చింది. అక్కడ లైవ్ ఈవెంట్లు చేయబోతోంది. ఎవరైనా తనకు ప్రోత్సాహకంగా ఎలాంటి సాయం చేయాలనుకుంటే చేయొచ్చు`` అని అన్నారు. మాజీ టి.ఎమ్మెల్యే వెంకట్రావ్ మాట్లాడుతూ - గొప్ప సంగీత దర్శకులు.. యువతరాన్ని ఉర్రూతలూగించి.. ఎందరో పెద్ద స్టార్లకు గొప్ప హిట్ సంగీతం ఇచ్చిన సంగీత దర్శకులు కోటి. బయటి ప్రపంచానికి తెలియని నిగూఢంగా దాగి ఉన్న బేబిలోని ట్యాలెంటును గుర్తించి సభ్య సమాజానికి పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ప్రతిభను గుర్తించి బయటకు చూపాలంటే వ్యయప్రయాసలకోర్చాలి. తనని ఒక గొప్ప గాయనిగా తీర్చిదిద్దేందుకు కోటి చేస్తున్న కృషిని అభినందిస్తున్నా. అందరూ తనని ప్రోత్సహిస్తున్నారు. కారుణ్య వంటి నవతరం ఎదగాలని కోరుకుంటున్నా. కోటి మరింతగా ఇలాంటి మంచి పనులుతో అందరూ గర్వించేలా చేయాలని కోరుతున్నా. బేబి మాట్లాడుతూ -`` పాడతానని .. ఆ పాట అంత వైరల్ అవుతుందని అనుకోలేదు. నేను బట్టలు ఉతికాక .. పక్కింటికి వెళ్లాను. అక్కడ ఆ అమ్మాయి పాడుతుంటే వీడియో తీసి వైరల్ చేసింది. అనుకోకుండా అవలీలగా ఆ పాటను అందరికీ చూపించింది. మా పాపకు బాబు పుట్టాడు. ఆస్పత్రిలో ఉన్నాను. ఈ పాట వాట్సాప్‌లో వైరల్‌గా మారింది... నీకు తెలుసా? అని అన్నారు. మీ అందరి సాయంతోనే నేను హైదరాబాద్ కి వచ్చాను. కోటి సర్ బోల్ బేబి బోల్ లో పాట పాడమని అన్నారు. సర్ ప్రోత్సహిస్తున్నారంటే అది అందరి దయ. పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇంత ఆదరించి నన్ను మీలో ఒకరిని చేసుకున్నారు. హైదరాబాద్ అంటే భయం భయం.. పట్నంలో మంచిగా ఉండరు. లెక్క చేయని స్థితిలో ఉంటారు అని భయపెట్టారు. కానీ ఇక్కడ అందరూ నన్ను దేవుళ్లు దేవతల్లా కనిపిస్తున్నారు. ఇది నిజం. ఈ పయనం భయంగానే సాగింది. నేను పుట్టాక .. రంగంపేట, రాజమండ్రి తప్ప ఎక్కడికీ వెళ్లలేదు. కోటి సార్ నాకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నారు. భయపడొద్దని పాట గురించి అవగాహన కల్పించి .. సంగీతంలో శిక్షణ ఇచ్చారు. తండ్రి, దేవుడు, అన్న అన్నీ తనే. ఈ పాటను వదిలిపెట్టను. పాడతానో లేదో తెలీదు కానీ ప్రయత్నిస్తాను. సార్ .. నడిపించిన బాటలో నడుస్తాను. లేదంటే మా ఊరు వెళ్లిపోతాను. మీ అందరి దీవెనలు కావాలి. వెంకట్రావు గారు విరాళం ఇచ్చి కళను ఇంతగా ప్రేమించడం ఆశ్చర్యం కలిగించింది. మట్టిలో పుట్టి పెరిగాను. కూలి పని చేసుకునేదానిని. అన్ని పనులు చేశాను. ఇక్కడికి వచ్చాను . మీ అందరి ఆదరాభిమానులతోనూ ఇలా రాగలిగాను. `మిర్రర్స్` కంపెనీ లక్ష్మి గారు.. పట్టు చీరలు ఇచ్చి రూ.30వేలు విరాళం ఇచ్చారు. నా జుత్తు రింగుల జుత్తు.. ఇది నాది కాదు.. నన్ను మార్చేశారిలా.. కార్ ఇచ్చి ప్రయాణాలకు సాయం చేశారు. హైదరాబాద్ లో దేవతులున్నారు దేవుళ్లున్నారు`` అన్నారుWatch Video Here
Read Moreమహానటి చిత్రంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు నాగ్ అశ్విన్ తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగాడు . ఇంతకీ నాగ్ అశ్విన్ కు కేటీఆర్ పై ఎందుకు కోపం వచ్చిందో తెలుసా ...... .... తన స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో . ఆదివారం రోజున హైదరాబాద్ లో ప్రయాణిస్తున్న నాగ్ అశ్విన్ కెమెరామెన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడట ! దాంతో అతడ్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు . ఆదివారం కావడంతో డాక్టర్లు కానీ ఇతర స్టాఫ్ కానీ అంతగా లేరు దాంతో గాయపడిన అతడ్ని స్టెచర్ పై బాధితుడి తల్లిదండ్రులే ఆసుపత్రి లోపలకు తీసుకెళ్లారట . అయితే వైద్యం కోసం అక్కడ మూడు గంటల పాటు ఎదురు చూసి ..... చూసి వైద్యం అందకపోవడంతో ఆ కెమెరామెన్ చనిపోయాడు . ఈ విషయం నాగ్ అశ్విన్ కు ఆలస్యంగా తెలియడంతో కేటీఆర్ పై నిప్పుల వర్షం కురిపించాడు . హైదరాబాద్ లాంటి మహానగరంలోనే వైద్యం అందకుండా అది కూడా మూడు గంటలకు పైగా డాక్టర్లు అందుబాటులో లేరంటే మేము ఎవరిని అడగాలి సార్ ? వైద్యం అందకుండా చనిపోవడం ఏంటి ? గాంధీ ఆసుపత్రి కాకుండా మరో ఆసుపత్రికి తీసుకుని వెళ్లి ఉంటే నా స్నేహితుడు బ్రతికే వాడు అంటూ కన్నీళ్ల పర్యంతం అవుతున్నాడు నాగ్ అశ్విన్ .
Read Moreతెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగితుంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు పాల్గొంటున్న ప్రచార సభల ప్రసంగంలో గెలుపు ధీమా చాల స్పష్టంగ కనపడుతుంది. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు సభలలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సభలలో ఆయన మాట్లాడుతూ టి ర్ స్ ఓడిపోతే నాకేం కాదు, గెలిస్తే ప్రజలకు సేవ చేస్తా ఓడిపోతే ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటాను లేకుంతే వ్యవసాయం చేసుకుంటా అని అన్నాడు .తెరాసా ఓడిపోతే ఎవరికి నష్టమో మీరే ఆలోచించండి అని ప్రజలకే వదిలేసాడు.ఈ ప్రకటన ఆయనకు ముందస్తు ఎన్నికలలో రానున్న విజయంపై నమ్మకంగా చెబుతున్నారు.
Read Moreకేటీఆర్ ఎన్నికల ప్రచారం జోరు పెంచారు. గ్రేటర్ లో ఎన్నికల ప్రచారం తన భుజాన వేసుకున్న కేటీఆర్ ప్రచారం లో భాగంగా ఓ విద్యా సంస్థలోకి వెళ్లారు.విద్యార్థులతో ముఖాముఖి సందర్భంగా మీ ఓట్లు ఎలాగూ టీఆర్ ఎస్ కే వేస్తారు. ఒకవేళ అలా కాకుండా.మీకు ఇంకో ఆలోచన ఉంటే మీకు నచ్చినవారికి ఓటు వెయ్యండి. ఎవరికీ ఓటు వెయ్యడం ఇష్టం లేకపోతే 'నోటా' కి ఓటు వెయ్యండి. అంతేగానీ ఓటు వెయ్యడం మాత్రం మానెయ్యొద్దు అని కేటీఆర్ అన్నాడు. కేటీఆర్ లాంటి నేత ఇలాంటి మాటలు అనడం తో అందరు షాక్ కి గురైయ్యారు.
Read Moreనిర్మాత , నటుడు బండ్ల గణేష్ రాజకీయ వేత్త కూడా అయ్యాడు ఇటీవలే . కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ సమక్షంలో చేరిన బండ్ల గణేష్ తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించబడ్డాడు . దాంతో అధికార ప్రతినిధిగా మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చిన బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేసాడు . కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టకపోతే నా గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని షాక్ ఇచ్చాడు బండ్ల . అంతేకాదు తెలంగాణలో కేసీఆర్ , కేటీఆర్ లు ఓడిపోవడం ఖాయమని , టీఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పటికే ఓ ఎంపీ వస్తున్నాడని అలాగే మరో పదిమంది ఎం ఎల్ ఏ లు కూడా రావడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేసాడు . కేసీఆర్ , కేటీఆర్ లు ఓడిపోతారని , అయితే హరీష్ రావు మాత్రం గెలుస్తాడని , కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెబుతున్నాడు బండ్ల . రాజేంద్ర నగర్ నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేయాలనీ భావించాడు కానీ టికెట్ దక్కలేదు . అయితే బండ్ల కినుక వహించడంతో పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు .
Read Moreఎన్నికల నామినేషన్ సందర్భంగా కేటీఆర్ ఆస్తులను అఫిడవిట్ లో ప్రకటించారు. కేటీఆర్ అఫిడవిట్ పేర్కొన్న దాని ప్రకారం ఆయన ఆస్తుల విలువ కంటే భార్య శైలిమ ఆస్తులు విలువ బాగా పరిగాయి.కేటీఆర్ మొత్తం చరాస్తుల రూ.3.63 కోట్లు కాగా ఆయన భార్య శైలిమ చరాస్తులు 27.70 కోట్ల అని అఫిడవిట్లో పేర్కొన్నారు.కేటీఆర్ స్థిరాస్తుల 1.30 కోట్లు కాగా శైలిమ స్థిరాస్తుల విలువ రూ.8.98 కోట్లు. పెట్టుబడులలొ కూడా కేటీఆర్ కంటే ఆయన భార్య శైలిమ ముందుంది.ఆమె పెట్టుబడుల వాటా రూ.8.98 కోట్లుగా పేర్కొన్నారు. కేసీఆర్ కు కోటి రూపాయలకు అప్పు ఇచ్చినట్టు కేటీఆర్ తన అఫిడవిట్ లో చూపించడం విశేషం.కేటీఆర్ కు మాత్రం ఒక ఇన్నోవా కారు ఉందని అపిడవిట్ లో పేర్కొన్నారు.
Read Moreతిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు మనం సైతం చేసిన కృషిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. తిత్లీ ప్రభావిత ఆరు గ్రామాలైన భర్తుపురం, కందులగూడెం, సవరనీలాపురం, మల్లివీడు, సాగరం పేట, నాయుడు పోలేరు గ్రామాల్లో మనం సైతం బృందం పర్యటించి, అక్కడి ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించింది. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మనం సైతం సభ్యులు కలిసి తమ సేవా కార్యక్రమాలను వివరించారు. వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి మనం సైతం సేవా దృక్పథాన్ని అభినందించారు. మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు మనం సైతం సారథి కాదంబరి కిరణ్ తెలిపారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో సేవా కార్యక్రమాల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ పేదలకు అవసరం ఉన్నా తమవంతు సహాయం అందించేందుకు మనం సైతం సిద్ధంగా ఉందని కాదంబరి చెప్పారు. కాదంబరి కిరణ్ వెంట ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వారిలో మనం సైతం సభ్యులు బందరు బాబీ, వినోద్ బాలా, సురేష్ తదితరులు ఉన్నారు.
Read Moreతెలంగాణ ఎన్నికల ప్రచారం చాల రసవత్తరంగా సాగనుంది. ఇప్పటికే టి ఆర్ ఎస్ పార్టీ ప్రచారం లో జోరు పెంచింది. మహాకూటమి అని కాంగ్రెస్ తో జత కట్టిన చంద్రబాబు ప్రచారం కోసం తన బావమరిది నందమూరి బాలకృష్ణను కూడా రంగంలోకి దింపుతుండటం విశేషం. బాలయ్య తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం పది రోజులు డేట్లు కేటాయించారు. త్వరలోనే ఆయన హైదరాబాద్ తో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించబోతున్నాడట.‘యన్.టి.ఆర్’ షూటింగ్ తో బిజీ గా ఉన్న బాలయ్య షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి ఎన్నికల ప్రచారం షూరూ చేయబోతున్నాడు.ఎన్నికల ప్రచారం లో భాగంగా బాలయ్య చేసే ప్రసంగాల కోసం తెలంగాణ ప్రజలు,టి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
Read Moreటాలీవుడ్ లో వందలాది చిత్రాల్లో కమెడియన్ గా నటించిన వేణుమాధవ్ తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతున్నాడు . పూర్వపు నల్లగొండ జిల్లా కోదాడ లో పోటీ చేస్తున్నాడు వేణుమాధవ్ . ఇతగాడి స్వగ్రామం కోదాడే అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు . సినిమాల్లోకి రాకముందు తెలుగుదేశం పార్టీ తరుపున మిమిక్రీ చేసుకుంటూ పార్టీకి సేవలందించాడు . మిమిక్రీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న వేణుమాధవ్ ని దర్శకులు ఎస్ వీ కృష్ణారెడ్డి హాస్య నటుడిగా పరిచయం చేసాడు . ఇంకేముంది అక్కడి నుండి తిరుగులేని హాస్యనటుడిగా రాణిస్తూ హీరోగా కూడా నటించాడు వేణుమాధవ్ . అయితే గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ సినిమాలకు దూరమయ్యాడు . సినిమాలు మానేసి ఇంటిపట్టునే ఉంటున్న వేణుమాధవ్ ఆంధప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం కూడా చేసాడు . ఇన్నాళ్లు పార్టీకి సేవ చేశాను కాబట్టి కోదాడ టికెట్ ఇవ్వమని కోరుతున్నాడు . అయితే వాళ్ళు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెబుతూ నామినేషన్ కూడా వేసాడు .
Read Moreతెలంగాణ జనసమితి(టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చారు. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ ఇస్తామన్న 8 స్థానాల్లో కాకుండా 12 స్థానాల్లో తాము పోటీ చేస్తామని కోదండరాం ప్రకటించారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఇస్తామన్న 8సీట్లకు టీజేఎస్ అంగీకారం తెలిపింది. అయితే ఆ 8 స్థానాలు ఏవేవి అన్నది ఇంతవరకు కాంగ్రెస్ కచ్చితంగా చెప్పడం లేదు . కాంగ్రెస్ చేస్తున్న తీవ్ర జాప్యంతో విసిగిపోయిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఎదురుతిరిగినట్టు కనిపిస్తోంది. 8 కాదు మొత్తం 12 స్థానాల్లో మేము పోటీ చేస్తామని టీజేఎస్ ప్రకటించింది. కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా వర్ధన్నపేట - దుబ్బాక - మెదక్ - మల్కాజ్ గిరి - అంబర్ పేట - వరంగల్ ఈస్ట్ - సిద్ధిపేట - జనగామ స్థానాలకు టీజేఎస్ కు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగానే ఉంది. అయితే 9వ స్థానంగా మిర్యాలగూడ తమకు ఇవ్వాలని టీజేఎస్ పట్టుబడుతోంది. ఈ స్థానాలు కూడా అదనంగా ఆసిఫాబాద్ - స్టేషన్ ఘన్ పూర్ - మహబూబ్ నగర్ స్థానాల్లో తాము పోటీ చేస్తామని టీజేఎస్ ప్రకటించడం తో మహాకూటమిలో కలకలం రేపింది. ఈ మూడు స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ - టీడీపీలు తమ అభ్యర్థులను ప్రకటించినా.. ఆ స్థానాల్లో తాము పోటీ చేస్తామని టీజేఎస్ ప్రకటించడం కాంగ్రెస్ నేతలకు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి. కోదండరాం తీసుకున్న నిర్ణయంతో మహాకూటమిలో ఒక్కసారిగా కలకలం రేపింది. అనూహ్యంగా తెలంగాణ జనసమితి రూటు మార్చడం చర్చనీయాంశంగా మారింది..టీజేఎస్ ప్రకటించిన 12 నియోజకవర్గాలు ఇవే .1 జనగామ2 స్టేషన్ ఘన్ పూర్3 మెదక్4 వరంగల్ ఈస్ట్5 సిద్ధిపేట6 వర్ధన్నపేట7 మిర్యాలగూడ8 ఆసిఫాబాద్9 దుబ్బాక10 మహబూబ్ నగర్11 మల్కాజ్ గిరి12 అంబర్ పేట
Read Moreసామాన్యులకు ఊహలకు అందని విధంగా రాజకీయాల్లో వ్యూహరచన చేసే కేసీఆర్.. తాజాగా గజ్వేల్ ఎమ్మెల్యేగా అంతే సింపుల్ గా నామినేషన్ కార్యక్రమాన్ని ముగించి ఆశ్యర్యపరిచాడు.అపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఇష్టదైవమైన కోనాయిపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం గజ్వేల్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ నామినేషన్ దాఖలు సందర్భంగా ఎలాంటి హంగు ఆర్బాటాలు పెట్టుకోకుండా సింపుల్ గా కానిచ్చేశాడు కేసీఆర్..కోనయపల్లి గ్రామస్థులు హరీష్ రావు మాత్రమే కేసీఆర్ వెంట ఉన్నారు. ఆ ఊళ్లోని గుడిలో చాలా సాదా సీదాగా పూజలు చేసి అక్కడే సంతకాలు పెట్టి గజ్వేల్ వెళ్లిపోయారు.జాతకాలు బాగా పాటించే కేసీఆర్ 2.24 గంటలకు కుంభలగ్న సమయములో నామినేషన్ పత్రాలను, గజ్వేల్ ఆర్డీవో కార్యాలయానికి వచ్చి అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నామినేషన్ వేసేటపుడు కే సి ర్ తో పాటు టీఆర్ఎస్ నేత హరీష్ రావు, ఐదుగురు సాధారణ కార్యకర్తల మాత్రమే ఉన్నారు.
Read Moreతెలంగాణ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నేపథ్యం లో కాంగ్రెస్ పార్టీ తాజాగా 10 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ట్విట్టర్ ద్వారా ఈ జాబితాను ప్రకటించింది.కాంగ్రెస్ రెండో జాబితాలో 10మందిని ప్రకటించింది. అయితే ఆశ్చర్యకరంగా రెండో జాబితాలో కూడా పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మూడో జాబితాను ఈ సాయంత్రం కల్లా విడుదల చేసే చాన్స్ ఉంది. మూడో జాబితా లో ఐనా పొన్నాల లక్ష్మయ్య పేరు ఉంటుందో వేచి చూడాలి.కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా.1.సిరిసిల్ల - కేకే మహేందర్ రెడ్డి2. ఖైరతాబాద్ - డా. దాసోజు శ్రవణ్3. జూబ్లిహిల్స్ - పి. విష్ణు వర్ధన్ రెడ్డి4. షాద్ నగర్ - సి. ప్రతాప్ రెడ్డి5. ఎల్లారెడ్డి - జాజల సురేందర్6. ధర్మపురి (ఎస్సీ) - అడ్లూరి లక్ష్మన్ కుమార్7. ఖానాపూర్ (ఎస్టీ) - రమేష్ రాథోడ్8. మేడ్చల్ - కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి9. భూపాలపల్లి - గండ్ర వెంకటరమణా రెడ్డి10. పాలేరు - కందల ఉపేందర్ రెడ్డి
Read Moreనందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని ని తెలంగాణ ఎన్నికల బరిలో దింపాలని భావిస్తున్నారట తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు . తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూకట్ పల్లి , లేదా జూబ్లి హిల్స్ నుండి నందమూరి కళ్యాణ్ రామ్ ని పోటీ చేయించాలని భావించాడు చంద్రబాబు అయితే ఆ ప్రతిపాదన కు కళ్యాణ్ రామ్ ఒప్పుకోలేదు . మరో పదేళ్ళ పాటు సినిమాలకే అంకితమని ఆ తర్వాతే రాజకీయాల గురించి , ఎన్నికల గురించి ఆలోచిస్తామని చెప్పాడట దాంతో హరికృష్ణ కుటుంబం నుండి ఎవరో ఒకరు పోటీ చేస్తే బాగుంటుందని భావించిన బాబు హరికృష్ణ కూతురు సుహాసిని ని కూకట్ పల్లి బరిలో నిలపాలని డిసైడ్ అయ్యాడట . బాబు సూచన మేరకు హరికృష్ణ కుటుంబం ఆలోచనలో పడింది . ఒకవేళ ఫ్యామిలీ లో ఏకాభిప్రాయం వస్తే సుహాసిని కూకట్ పల్లి ఎన్నికల బరిలో పోటీ చేయడం ఖాయం అవుతుంది . రాజకీయాల పట్ల ఆసక్తి లేదు అని సుహాసిని భావిస్తే కూకట్ పల్లి టికెట్ ని మరొకరికి కేటాయించడం ఖాయం . ఇప్పుడు నిర్ణయం కళ్యాణ్ రామ్ , సుహాసిని ల చేతిలో ఉంది . వాళ్ళు అంగీకరిస్తే సానుభూతి కూడా తోదవుతుందని అవలీలగా గెలవడం ఖాయమని భావిస్తున్నారు బాబు .
Read Moreకాంగ్రెస్ పార్టీలో సీట్ల పోరులో భాగంగా సీట్లు లభించని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆందోళనపై మంత్రి కేటీఆర్ తనదయిన రీతిలో స్పందించాడు . గాంధీభవన్ ను చూస్తుంటే గాంధీ ఆస్పత్రిని తలపిస్తోంది అని సెటైర్ వేశారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు సెలైన్ బాటిళ్లు పెట్టుకొని దీక్షలు చేస్తున్నారని - సీట్ల కోసమే కొట్లాడుకుంటున్న వారికి పదవిస్తే ఏం చేస్తారు అని కేటీఆర్ ప్రశ్నించారు. జలవిహార్ లో ఏర్పాటు చేసిన దివ్యాంగుల కృతజ్ఞత సభలో పాల్గొన్న కేటీఆర్ దివ్యాంగులకు సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అండగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే దివ్యాంగుల పెన్షన్ ను రూ. 1500కు పెంచిందన్నారు. డిసెంబర్ 11న మళ్లీ టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల పెన్షన్ ను రూ. 3016కు పెంచుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీట్లు ఇంకా పూర్తిస్థాయిలో ఖరారు కాలేదని - మొదటి జాబితాకే ఈ స్థాయిలో సిగపట్లు ఉంటే.... మొత్తం సీట్లు ప్రకటించే వరకు పరిస్థితి ఎలా ఉంటుందోనని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. పగటిపూట సీట్లు ప్రకటిస్తే గొడవలు అవుతాయని కాంగ్రెస్ పార్టీ జాబితాను అర్ధరాత్రి ప్రకటించారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనను ప్రధాని మోడీ పొగిడారని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ పరిణతితో వ్యవహరిస్తున్నారంటూ మోడీ పార్లమెంట్ లో చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.దివ్యాంగుల కోసం తమ ప్రభుత్వం పాటుపడుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దివ్యాంగులను పెళ్లి చేసుకున్న వారికి రూ. లక్ష చొప్పున ప్రోత్సాహకం ఇస్తున్నామన్నారు. `రూ. 10 కోట్ల వరకు దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ ను దివ్యాంగులకు కల్పించాం. డబుల్ బెడ్ రూం ఇండ్లలో 5 శాతం దివ్యాంగులకు ఇస్తాం. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఐటీ పార్కులు - ప్రతి జిల్లాలో దివ్యాంగ్ భవనాలు నిర్మిస్తాం` అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Read Moreఎంతగానో ఎదురుచూస్తున్న కాంగ్రెస్ జాబితా ఎట్టకేలకు సోమవారం రాత్రి విడుదలైంది. టీఆర్ఎస్ పై పోటీచేసే ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థులను ఎట్టకేలకు ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. సోమవారం రాత్రి 11.30 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర పీసీసీ పెద్దలు మొత్తం అభ్యంతరాలు లేని స్థానాల్లో పోటీచేసే 65మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ అధిష్టానం టికెట్లు కేటాయించింది. కోదండరాం ఆశిస్తున్న జనగాం ప్రకటించకుండా అక్కడ నుంచి బరిలో ఉన్న పీసీసీ మాజీ చీఫ్ పొన్నాలకు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. వరంగల్ ఈస్ట్ వెస్ట్ భూపాలపల్లి వర్ధన్నపేట బెల్లంపల్లి తో పాటు వరంగల్ ఈస్ట్ వెస్ట్ భూపాలపల్లి వర్ధన్నపేట బెల్లంపల్లి,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ స్థానాలను పెండింగ్ పెట్టారు . మంగళవారం మధ్యాహ్నం రెండో జాబితాను విడుదల చేసే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ తొలి జాబితాలోని అభ్యర్థులు వీరే.. 1. సిర్పూర్- పాల్వయి విహరీష్ బాబు2. చెన్నూర్-వెంకటేశ్ నేత3.మంచిర్యాల-ప్రేమ్ సాగర్ రావు4. ఆసిఫాబాద్- ఆత్రం సక్కు5. ఆదిలాబాద్- గండ్రత్ సుజాత6. నిర్మల్- ఏలేటీ మహేశ్వర్ రెడ్డి7. ముథోల్ - రామారావ్ పటేల్8. ఆర్మూర్-ఆకుల లలిత9. బోధన్-సుదర్శన్ రెడ్డి10. జుక్కల్ - గంగారం11. బాన్సువాడ- బాలరాజు12. కామారెడ్డి -షబ్బీర్ అలీ13. జగిత్యాల - జీవన్ రెడ్డి14. రామగుండం -రాజ్ ఠాకూర్15. మంథని - శ్రీధర్ బాబు16. పెద్దపల్లి -విజయరమణారావు17. కరీంనగర్ - పొన్నం ప్రభాకర్18. చొప్పదండి - మేడిపల్లి సత్యం19. వేములవాడ -ఆది శ్రీనివాస్20.మానకొండూర్- ఆరేపల్లి మోమన్21. ఆంథోల్ -దామోదర రాజనర్సింహా22. నర్సాపూర్ సునీతా లక్ష్మారెడ్డి23. జహీరాబాద్- గీతారెడ్డి24. సంగారెడ్డి- జగ్గారెడ్డి25. గజ్వేల్ -ఒంటేరు ప్రతాప్ రెడ్డి 26. కుత్బుల్లాపూర్ -కూన శ్రీశైలం గౌడ్27. మహేశ్వరం -సబితా ఇంద్రారెడ్డి28. చేవెళ్ల- కేఎస్ రత్నం29. పరిగి- రామ్మోహన్ రెడ్డి30. వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్31. తాండూర్ -రోహిత్ రెడ్డి 32. ముషీరాబాద్- అనిల్ కుమార్ యాదవ్33. నాంపల్లి- ఫిరోజ్ ఖాన్34. గోషామహల్- ముఖేష్ గౌడ్35. చార్మినార్ -మహ్మద్ గౌస్36. చాంద్రాయణ గుట్ట-ఇసా బినోబైడ్ మిస్త్రీ37. సికింద్రాబాద్- సర్వే సత్యనారాయణ38.కొడంగల్ - రేవంత్ రెడ్డి39. జడ్చర్ల -మల్లు రవి40. వనపర్తి -చిన్నారెడ్డి41. గద్వాల -డీకే అరుణ42.ఆలంపూర్ -సంపత్ కుమార్43. నాగర్ కర్నూల్ - నాగం జనార్ధన్ రెడ్డి44. అచ్చంపేట -వంశీ కృష్ణ45. కల్వకుర్తి-వంశీచంద్ రెడ్డి46. నాగార్జున సాగర్ - జానారెడ్డి47. హుజూర్ నగర్ -ఉత్తమ్ కుమార్ రెడ్డి 48. కోదాడ - పద్మావతి రెడ్డి49. సూర్యపేట -దామోదర రెడ్డి50. నల్గొండ -కోమటిరెడ్డి వెంకటరెడ్డి51. మునగోడు -కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి52. భువనగిరి - అనిల్ కుమార్ రెడ్డి53. నకిరేకల్ - చిరుమర్తి లింగయ్య54. ఆలేరు - భిక్షమయ్య గౌడ్55. స్టేషన్ ఘన్ పూర్ - సింగపూర్ ఇందిర56. పాలకుర్తి - రాఘవరెడ్డి57. డోర్నకల్ - రామచంద్రు నాయక్58. మహబూబాబాద్ - బలరాం నాయక్59. నర్సంపేట - దొంతి మాధవరెడ్డి60. పరకాల - కొండా సురేఖ61. ములుగు - సీతక్క62. పినపాక - రేగ కాంతారావు63. మధిర - భట్టి విక్రమార్క64. కొత్తగూడెం - వనమా వెంకటేశ్వరరావు65. భద్రచాలం - పోడెం వీరయ్య
Read Moreరజిని కాంత్ మీడియాతో మాట్లాడుతూ మోడీ సర్కారుపై ఊహించని రీతిలో వ్యాఖ్యలు చేశారు. గతంలో పెద్ద నోట్ల రద్దు అంశాన్ని ప్రకటించిన ప్రధాని మోడీని ప్రశంసించిన రజనీకాంత్.. తాజాగా మాత్రం ఆ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ప్రతిపక్షాలు భావిస్తున్నట్లుగా బీజేపీ డేంజర్ పార్టీగా అన్న భావన కలిగేలా ఉందన్న వ్యాఖ్య రజనీ నోటి నుంచి వచ్చింది. నోట్ల రద్దు సరిగా అమలు కాకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లుగా చెప్పారు. బీజేపీని ప్రమాదకరమైన పార్టీగా ప్రతిపక్షాలు భావిస్తున్నందు వల్లే.. కూటమిగా జట్టు కట్టాలని భావిస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఒక్క మాటలో చెప్పటం కష్టమన్నారు. ప్రజల్లో వచ్చిన మార్పే రజనీ నోట వినిపించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోడీ నిర్ణయాల్ని తప్పు పట్టిన రజనీకాంత్ వ్యాఖ్యలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Read More1. నామ నాగేశ్వరరావు2. సత్తుపల్లి- సండ్రవెంకట వీరయ్య3. అశ్వారావుపేట- మచ్చ నాగేశ్వర రావు4. వరంగల్ పశ్చిమ - రేవూరి ప్రకాష్ రెడ్డి5. మక్తల్ - కొత్తకోట దయాకర్ రెడ్డి6. మహబూబ్ నగర్- ఎర్ర శేఖర్7. ఉప్పల్ - వీరందర్ గౌడ్8. శేరి లింగంపల్లి - భవ్య ఆనంద ప్రసాద్9. మలక్ పేట్ - ముజాఫర్
Read Moreకేసీఆర్ ...... నీ తాట తీస్తా అంటూ గత ఎన్నికల సమయంలో వరంగల్‌లో కేసీఆర్ పై విరుచుకుపడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా ఫ్లేట్ ఫిరాయించాడు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ ని విమర్శించిన పవన్ 2018 ఎన్నికలకు వచ్చేసరికి మద్దతు ప్రకటించాడు. అయితే ఈ మద్దతు తెరవెనుక మాత్రమే బహిరంగంగా కాదు సుమా! కేసీఆర్ ని కేటీఆర్ ని కవిత లను తీవ్ర స్థాయిలో విమర్శించిన పవన్ రెండేళ్ల క్రితం తన స్టాండ్ మార్చుకున్నాడు. కేసీఆర్ పై ప్రశంసలు కురిపించాడు అంతేకాదు అదే సమయంలో చంద్రబాబు ని తీవ్ర స్థాయిలో విమర్శించడం మొదలు పెట్టాడు. ఆంద్రప్రదేశ్ లో 2019 మే లో ఎన్నికలు రానున్నాయి కానీ ఇప్పుడే అక్కడ అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించాడు . తెలంగాణ లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కానీ ఇక్కడ మాత్రం పోటీ చేయడం లేదు. కేసీఆర్ కు భయపడి తెలంగాణలో పోటీ చేయడం లేదని విమర్శలు వచ్చిపడుతున్నాయి పవన్ కల్యాణ్ మీద అయితే విమర్శలు ఎన్ని వచ్చినా పవన్ మాత్రం తెలంగాణ ఎన్నికల పై నోరు మెదపడం లేదు. దాంతో కేసీఆర్ కు పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించినట్లే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Read Moreతెలంగాణ లో ఎన్నికల వేడి రాజుకుంది . కేసిఆర్ ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడంతో తెలంగాణలో 9 నెలల ముందే ఎన్నికలు వచ్చిపడ్డాయి . దాంతో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు కేసిఆర్ ని ఓడించడానికి మహాకుటమిగా జట్టుకట్టాయి . అయితే కొంగర కలాన్ సభ తర్వాత కేసిఆర్ ఇమేజ్ అసాధారణ స్థాయిలో తగ్గిపోయిందని కొన్ని సర్వేలు తెలియజేస్తుండగా కొంగర కలాన్ తర్వాత కేసిఆర్ గ్రాఫ్ గణనీయంగా పెరిగిందని ఇండియాటుడే తాజాగా ప్రకటించింది . అంతేకాదు మహాకుటమి అసలు తెలంగాణ రాష్ట్ర సమితి కి పోటీ కానే కాదని అచ్చం కేసిఆర్ చేయించిన సర్వే లా చెబుతోంది . దేశ వ్యాప్తంగా ఇండియా టుడే కి కాస్త క్రెడిబిలిటీ ఉంది కానీ తాజా సర్వే ప్రకారం మళ్ళీ కేసిఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పడంతో ఆ సర్వే పై నీలినీడలు కమ్ముకున్నాయి . అసలు కొంగర కలాన్ సభ తర్వాత కేసిఆర్ గ్రాఫ్ అనూహ్యంగా పడిపోయింది . అంతేకాదు మహాకుటమి అసలు పోటీనే కాదని కేసిఆర్ కానీ టిఆర్ఎస్ శ్రేణులు అస్సలు భావించడం లేదు ఎందుకంటే కేసిఆర్ కానీ కేటిఆర్ కానీ హరీష్ రావు కానీ మహాకుటమి ని , చంద్రబాబు ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తునారు . అంటే మహాకుటమి అంటే ఏ మూలనో భయం ఉన్నట్లే కదా ! మహాకుటమి లెక్కలో లేకుంటే చంద్రబాబు ని తీవ్ర స్థాయిలో విమర్శించాల్సిన అవసరం లేదు కదా ! డిసెంబర్ 7 న తెలంగాణలో ఎన్నికలు జరగుతుండగా డిసెంబర్ 11 న ఫలితాలు వెలువడనున్నాయి .
Read More