పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవబోతున్నాడా?

Published on Jan 04,2019 12:02 PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో,రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏసిన ఎత్తులు ఈసారి పనిచేయడం లేదు. జ‌న‌సేన తో దోస్తీ కడదామని చుసిన చంద్రబాబు కి భంగపాటు ఎదురయింది.జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల్లో సింగిల్‌గానే బ‌రిలోకి దిగుతోంది అని తెలిసింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు ఉన్న ప్ర‌జాద‌ర‌ణ దృష్ట్యా 25 నుండి 35 సీట్లు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని బావిస్తుంన్నారు.దీనిని బట్టి చుస్తే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్.మరి జనసేన ఈఎన్నికలలో ఎటువంటి పాత్ర పోషిస్తుందో తెలియాలి అంటే ఎన్నికల వారికి వేచి చుడండి.

Read More

ఏపీ సీఎం చంద్రబాబు ఫై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్

Published on Dec 31,2018 12:46 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మీడియా ముందుకు వచ్చి తన ప్రత్యర్థి ఏపీ సీఎం చంద్రబాబు ఫై విమర్శనా అస్త్రాలు సందించారు .ప్రెస్ మీట్ లోని అంశాలు :చంద్రబాబంతా డర్టీయస్ట్ పోలిటిషియన్ ఇవాళ దేశంలో ఎవరూ లేదు. నవీన్ పట్నాయక్ ను ఎందుకు కలిశావు ఎల్లయ్యను ఎందుకు కలిశావు - మల్లయ్యను ఎందుకు కలిశావు. అని అడుగుతున్నారు  అవన్నీ ఆయనకేం అవసరం? నాలుగేళ్లు మోదీసంకలో ఉన్నావు. అప్పుడు మేం మోదీని పొగడాలా. ఇప్పుడు నువ్వు రాహుల్ సంకలోకి ఎక్కగానే, మేమూ కాంగ్రెస్ వెంబడి రావాలా, రాహుల్ గాంధీ విజయవాడ వస్తున్నాడంటే ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడని ప్రశ్నించాడు. నిన్న నరేంద్ర మోదీ వస్తున్నాడంటే ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడని మాట్లాడుతున్నాడు. అసలు నీదేం మొఖం నాకర్థం కాదుబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ ను భరిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేతులెత్తి మొక్కాలి. ఎన్ని పచ్చి అబద్ధాలు! సిగ్గుపడాలి చంద్రబాబు! చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు పేలుతున్నాడు. ఆయన నోటికి మొక్కాలి. రాష్ట్రం విడిపోయి అయిదేళ్లు అయ్యింది. మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ నాయకుడైనా వాళ్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ల హైకోర్టు వాళ్ల దగ్గరకు మార్చుకోవాలి. ఈ అడ్డగోలు మాటలకు ఏమైనా అర్థముందా? . దానికి ఒకటి రెండు పత్రికలు బాకా కొట్టడం! ప్రతి రోజూ ఇదే జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలలో ఇదో పెద్ద డ్రామా అయిపోయిందిచంద్రబాబు యూజ్ అండ్ త్రోలో నంబర్ వన్. మొన్న అమాయకురాలైన హరికృష్ణ బిడ్డ ను నిలబెట్టాడు. ఇప్పుడేమైనా న్యాయం చేస్తావా ఆ అమ్మాయికి? ఏమీ చేయడు. ఎన్నికల ముందు వాడుకోవాలి అంతే!చంద్రబాబుకు నాలుగు వాక్యాలు చక్కగా ఇంగ్లిష్ లో మాట్లాటం వస్తుందా? రెండు సెంటెన్స్ లు హిందీలో మాట్లాడటం వస్తుందా? ఇక... ఢిల్లీలో చక్రం ఎలా తిప్పాలి? అంతా ఒట్టిదే.. డొల్ల. చక్రం లేదు - చింపింది లేదు. చచ్చింది లేదు!

Read More

జనవరి మొదటి వారంలో తెలంగాణ కాబినెట్ విస్తరణ?

Published on Dec 29,2018 11:49 AM

తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టి ఆర్ స్  అధ్యక్షుడు , ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర రావు  మంత్రివర్గాన్ని విస్తరించే పనిలో పడ్డారు. రేపు(డిసెంబర్ 30) కానీ  - జనవరి మొదటి వారంలో కాని మంత్రివర్గాన్ని విస్తరించే పని చేపడతారని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు  చెబుతున్నారు. ఈ క్యాబినెట్ లో 18 మందికి చోటు దక్కనుంది అని సమాచారం . తెలంగాణ ముఖ్యమంత్రి  జాతీయ రాజకీయాల వైపు శ్రద్ధ పెట్టేందుకు పార్టీ పగ్గాలను తన కుమారుడు కే టి ర్  కి  అప్పగించారు. ఆయన కూడా పార్టీని పటిష్టం చేసే పనిని ప్రారంభించారు. గత క్యాబినెట్ లో మహిళలకు ఒక్క మంత్రి పదవి కూడా దక్కలేదు. కేవలం డిప్యూటీ స్పీకర్ పదవిని మాత్రమే ఇచ్చారు. దీంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఈసారి మంత్రి వర్గంలో మహిళలకు కచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గంలోని సీనియర్లను తీసుకోకుండా యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. ముఖ్యమంత్రి - హోమంత్రి కలిపి ఇద్దరు మంత్రులున్నారు. ఇక మిగిలిన 16 మంత్రిపదవులు ఎవరిని వరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. 

Read More

కేటీఆర్ ని కలిసి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్

Published on Dec 20,2018 04:17 PM

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుని కలిసి ఎన్టీఆర్ పిచ్చ షాక్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు కి అలాగే బాబాయ్ బాలకృష్ణ కు. ఇటీవలే తెలంగాణలో అసెంబ్లీ కి ఎన్నికలు జరుగగా కూకట్ పల్లి నుండి నందమూరి సుహాసిని తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యింది. అక్క కోసం ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు. దాంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ పై ఆగ్రహం గా ఉన్నారు. ఇక ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్ కేటీఆర్ ని ఓ ఫంక్షన్లలో కలవడం సంచలనం సృష్టిస్తోంది. ఎన్టీఆర్ కేటీఆర్ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. అక్క కోసం ప్రచారం చేయడం ఇష్టం లేని తమ్ముడు ప్రత్యర్థి పార్టీ నాయకుడితో మాత్రం కలిసి ఫోటో దిగడం ఏంటి ? అని విమర్శిస్తున్నారు నెటిజన్లు. అయితే ఎన్టీఆర్ పై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం ఎన్టీఆర్ నే సమర్దిస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో అప్పట్లో చురుగ్గా పాల్గొన్నాడు కానీ చంద్రబాబు వ్యవహారం వల్ల ఎన్టీఆర్ చాలాకాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. 

Read More

ప్రభాస్ కు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

Published on Dec 18,2018 10:53 AM

హీరో ప్రభాస్ గెస్ట్ హౌజ్ ని సీజ్ చేసి అతడికి షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం . శేరిలింగం పల్లి రాయదుర్గం లోని 46 సర్వే నెంబర్ లో 2200 గజాల స్థలంలో ప్రభాస్ తన గెస్ట్ హౌజ్ కట్టుకున్నాడు . అయితే ఈ కట్టడం అక్రమమని అంతేకాకుండా అది ప్రభుత్వ స్థలమని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకేకింది . కోర్టు తీర్పు ప్రకారం ప్రభాస్ కట్టుకున్న గెస్ట్ హౌజ్ ప్రభుత్వ స్థలమని తేల్చి చెప్పింది . దాంతో కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభాస్ గెస్ట్ హౌజ్ ని సీజ్ చేసారు అధికారులు . ప్రభాస్ గెస్ట్ హౌజ్ కు తాళాలు వేయడమే కాకుండా సీజ్ చేసి నోటీసులు అంటించారు . ప్రభుత్వ అధికారులు నోటీసులు అంటించారు కాబట్టి గెస్ట్ హౌజ్ ఇక అధికార్ల అధీనంలో ఉండనుంది . అయితే కొద్దికాలం క్రితమే రెగ్యులరైజ్ చేయమని ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు ప్రభాస్ . మరి తెలంగాణ ప్రభుత్వం ప్రభాస్ పట్ల సానుకూలంగా స్పందించి రెగ్యులరైజ్ చేస్తుందా ? లేక అక్రమ కట్టడం అని కూల్చుతుందా చూడాలి . 

Read More

న్యూస్ యాంకర్ ఆత్మహత్య

Published on Dec 15,2018 11:42 AM

ఉత్తరప్రదేశ్ లోని ఓ న్యూస్ ఛానల్ లో పనిచేసే యాంకర్ రాధికా కౌశిక్ ఆత్మహత్య సంచలనం సృష్టిస్తోంది . న్యూస్ యాంకర్ రాధికా కౌశిక్ - మరో యాంకర్ రాహుల్ ఇద్దరూ కొంతకాలంగా నోయిడా లోని అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకొని సహజీవనం చేస్తున్నారు . కాగా నిన్న ఉదయం నుండి జాబ్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ ఇద్దరు కూడా మద్యం సేవించారు . అయితే మద్యం మత్తులో ఉన్న సమయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో నాలుగో అంతస్థు నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది రాధికా కౌశిక్ . ఈ విషయాన్నీ పోలీసులకు అక్కడి వాచ్ మెన్ ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు రాహుల్ ని అరెస్ట్ చేసి తమ అదుపులో ఉంచుకున్నారు . నేను బాత్ రూంలోకి వెళ్లిన సమయంలో రాధికా ఆత్మాహత్య చేసుకుందని అందుకే ఆమెని కాపాడలేక పోయానని చెబుతున్నాడు రాహుల్ . రాధికా కౌశిక్ ఆత్మహత్య చేసుకుందా ? లేక హత్య చేసారా ? అన్న కోణం లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు . రాధికా - రాహుల్ పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్నారు . 

Read More

అక్క ఓటమితో కుంగిపోయిన ఎన్టీఆర్

Published on Dec 12,2018 03:35 PM

అక్క నందమూరి సుహాసిని కూకట్ పల్లి లో ఓడిపోవడంతో ఎన్టీఆర్ కుమిలి కుమిలి పోతున్నాడట. అక్క నందమూరి సుహాసిని తెలంగాణ ఎన్నికల్లో  కూకట్ పల్లి నుండి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి ప్రయోజనం ఉండదని పైగా తండ్రి హరికృష్ణ మరణించిన ఈ సమయంలో అస్సలు మంచిది కాదని ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశాడట. కానీ ఎన్టీఆర్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో విభేదించిన చంద్రబాబు పట్టుబట్టి మరీ సుహాసిని ని కూకట్ పల్లి బరిలో దించారు. కట్ చేస్తే ఘోరంగా ఓడిపోయింది సుహాసిని దాంతో ఎన్టీఆర్ కోపంతో ఊగిపోతున్నాడట . నాన్న చనిపోవడం , అక్క ఓడిపోవడంతో ఎన్టీఆర్ తో పాటుగా నందమూరి కుటుంబం షాక్ కి గురయ్యిందట. 

Read More

తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన హీరోయిన్

Published on Dec 12,2018 03:23 PM

ఈరోజుల్లో చిత్రంతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన భామ రేష్మ . మారుతి దర్శకత్వం వహించిన ఈరోజుల్లో చిత్రంలో హీరోయిన్ గా నటించిన రేష్మ తెలంగాణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ స్థానం నుండో పోటీ చేసింది . అయితే భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేసి దారుణంగా ఓడిపోయింది . ఈ భామకు సమాజసేవ చేయాలనే ఆశ ఉండేది దాంతో రాజకీయాల్లోకి వెళ్ళింది . అయితే మరో పార్టీ నుండి పోటీ చేసి ఉంటే ఎలా ఉండేదో కానీ ఏమాత్రం బలం లేని భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేసి దారుణంగా ఓడిపోయింది . ఈరోజుల్లో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే . ఆ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించింది కానీ అవేవి ఈ భామకు కెరీర్ పరంగా ఉపయోగపడలేదు . దాంతో సినిమాలు పక్కన పెట్టి రాజకీయాల్లోకి రావాలని బిజెపి లో చేరింది దెబ్బతింది . దాంతో రెంటికి చెడిన రేవడిలా తయారయ్యింది రేష్మ పరిస్థితి . 

Read More

కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం

Published on Dec 12,2018 03:13 PM

రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో విజయ పతాకాన్ని ఎగురవేసిన టి.ఆర్.ఎస్. అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావును మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అభినందించింది. అందరి అంచనాలను మించి అఖండ విజయాన్ని రెండోసారి కూడా సాధించిన ఘనత కె.సి.ఆర్.కు దక్కిందని 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. టి.ఆర్.ఎస్. ప్రభుత్వం చిత్రసీమ అభివృద్ధి కోసం ఎంతో కట్టుబడి ఉందని, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారిని, ఎఫ్.డి.సి. ఛైర్మన్ రామ్మోహనరావు గారిని ఎప్పుడు ఏ పని నిమిత్తం కలిసినా ఎంతో సహకరించారని ఆయన చెప్పారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ రజతోత్సవ సంవత్సరం సందర్భంగా తమ ముందు ఓ పెద్ద బాధ్యత ఉందని, గోల్డేజ్ హోమ్ నిర్మాణాన్ని ఈ కార్యవర్గం ఉండగానే ప్రారంభించాలను కుంటున్నామని శివాజీరాజా తెలిపారు. అందుకు కాబోయే ముఖ్యమంత్రి  కేసీఆర్ గారితో పాటు, కె.టి.ఆర్., హరీశ్ రావు, కవిత, తలసాని శ్రీనివాస యాదవ్ గార్ల సహకారం లభిస్తుందని భావిస్తున్నామని అన్నారు. ఒకసారి మాట ఇస్తే దాని మీద నిలబడే వ్యక్తి కేసీఆర్ అని, ఆ నమ్మకం తమకు ఉందని శివాజీరాజా అన్నారు. త్వరలోనే ఈ విషయమై కేసీఆర్ గారిని కలుస్తామని, తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'గోల్డ్ ఏజ్ హోమ్'ను ఆయన సహకారంతో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యంగా సిద్ధిపేటను అత్యంత ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దిన హరీశ్ రావును శివాజీ రాజా అభినందించారు. ఆ అభివృద్ధి కారణంగానే అక్కడి ప్రజలు లక్ష ఓట్లకు మైగా మెజారిటీని ఆయనకు అందించారని అన్నారు.ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పిన ఫిగర్ ను రీచ్ కావడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, చెప్పి మరీ కేసీఆర్ మ్యాజిక్ ఫిగర్ ను దాటి భారీ మెజారిటీ సాధించారని 'మా' కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. సినీ ప్రముఖుల సహకారంతో, ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ లో గోల్డ్ ఏజ్ హోమ్ ను ప్రారంభించాలను కుంటున్నామని, తెలంగాణ ప్రభుత్వం సైతం తమ వంతు సహకారం అందిస్తుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. పది పదిహేను సంవత్సరాలపాటు పోరాడి ప్రత్యేక రాష్ట్రంను సాధించిన నాయకుడు కేసీఆర్ అని, ఆయన నాయకత్వం మీద నమ్మకంతోనే రెండోసారి కూడా టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారని, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరినీ కేసీఆర్ బాగా చూసుకుంటారని బెనర్జీ తెలిపారు. గడిచిన నాలుగున్నర యేళ్ళకు మించిన అభివృద్దిని రాబోయే ఐదేళ్ళలో కేసీఆర్ చేస్తారనే నమ్మకం తనకుందని ఆయన అన్నారు. రెండోసారి కూడా భారీ మెజారిటీతో, భారీ సీట్లను టి.ఆర్.ఎస్. పొందడం ఆనందంగా ఉందని, ముఖ్యంగా తలసాని శ్రీనివాస యాదవ్, మాగంటి గోపీనాథ్ వంటి సినిమా వారు గెలవడం సంతోషంగా ఉందని ఏడిద శ్రీరామ్  అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న కేసీఆర్ కు సురేశ్ కొండేటి శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్, మాగంటి గోపీనాథ్ వంటి వారి సహకారంతో చిత్రసీమ మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Read More