టీవీ ఆర్టిస్ట్ ఝాన్సీ ఆత్మహత్య

Published on Feb 06,2019 12:25 PM

టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది . మాటీవీ లో ప్రసారమయ్యే పవిత్ర బంధం సీరియల్ లో నటించిన ఝాన్సీ ఇటు సీరియల్ లకు దూరమై అటు కోరుకున్న ప్రియుడు మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది . ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియడంతో బుల్లితెర తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యింది . మాటీవీలో ప్రసారమయ్యే పవిత్ర బంధం సీరియల్ లో చేస్తున్న సమయంలో సూర్య తో పరిచయం కాస్త ప్రేమగా మారింది . దాంతో అతడితో సహజీవనం కూడా చేసిందట ఝాన్సీ . అయితే పెళ్లి చేసుకుందామని ఎంతగా పోరు పెట్టినప్పటికీ సూర్య నిరాకరించడంతో అటు కెరీర్ పోయి ఇటు ప్రేమలో విఫలం కావడంతో సూసైడ్ చేసుకుంది . ఝాన్సీ ఆత్మహత్య ని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు . 

Read More

ఉపాసన పై రాజకీయ కుట్ర

Published on Jan 29,2019 12:06 PM

చిరంజీవి కోడలు చరణ్ భార్య అయిన ఉపాసన పై రాజకీయ కుట్ర కు పాల్పడుతున్నారు . చేవెళ్ల పార్లమెంట్ మాజీ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై అధికార పార్టీ టీఆర్ఎస్ తరుపున ఉపాసన పోటీ చేయడానికి రంగం సిద్ధమైంది అన్నట్లుగా ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తలు వచ్చాయి అయితే అవి ఉపాసన దృష్టికి రాగానే వెంటనే ఖండించింది . చేవెళ్ల నుండి పోటీ చేయబోవడం లేదు , పైగా మా చిన్నాన్న ( కొండా విశ్వేశ్వర్ రెడ్డి ) చేవెళ్ల లో చాలా మంచి పనులు చేసున్నాడు అంటూ ఆ గాలి వార్తలను కొట్టి పడేసింది ఉపాసన . అంతేకాదు అపోలో ఆసుపత్రిలో నాకు బోలెడు పనులు ఉన్నాయి వాటిని నిర్వహించాలి అంటూ పోస్ట్ పెట్టేసింది ఉపాసన . చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడైన కొండా టీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే . మరో మూడు నెలల్లో పార్లమెంట్ కు ఎన్నికలు వస్తుండటంతో ఈ ఊహాగానాలు వచ్చాయి , దానికి తోడు కేటీఆర్ కు మంచి ఫ్రెండ్ ఉపాసన అందుకే ఇలా వార్తలు పుట్టుకొచ్చాయి . 

Read More

న్యూజిలాండ్ ఫై ఘన విజయం సాధించిన ఇండియా

Published on Jan 28,2019 03:22 PM

న్యూజిలాండ్ లో ఇండియా దూసుకుపోతుంది. న్యూజిలాండ్ లోని  మౌంట్  మౌనంగానూయి  లో జరిగిన మూడో వన్డే లో ఇండియా ఘన విజయం సాధించింది.ఐదు వన్డేలు సిరీస్ లో భాగంగా వరుసగా మూడు వన్డేలు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా లో సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన మరోమారు న్యూజీలాండ్ లో కూడా క్లీన్ స్వీప్ దిశగా సాగుతుంది.స్థానిక మౌంట్  మౌనంగానూయి జరిగిన మూడో వన్డే లో తొలుత బాటింగ్ చేసిన న్యూజిలాండ్ 243  పరుగులకే అల్ ఔట్ కాగా కోహ్లీ సేన మూడు వికెట్లు కోల్పోయి లక్షాన్ని ఛేదించింది.బాటింగ్ లో రోహిత్ (62),ధావన్ (28),కోహ్లీ(60) పరుగులుగా చేసి అవుట్ య్యారు.రాయుడు (40),కార్తీక్ (38) పరుగులు చేసి విజయాన్ని అందించారు.

Read More

రూ.4.2లక్షల కోట్ల ఆస్తిని విడాకుల భరణంగా ఇచ్చిన బడా కంపెనీ వ్యవస్థాపకుడు!

Published on Jan 11,2019 05:38 PM

అమెజాన్  కంపెనీ వ్యవస్థాపకుడు. అపర కుబేరుడు. ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన జెఫ్ బెజోస్.  జెఫ్ బెజోస్ స్నేహితుడి(ప్యాట్రిక్ వైట్సెల్) భార్య(లారెన్ శాంచెజ్ )తో సంబంధం పెట్టుకొని పాతికేళ్లుగా కలిసి ఉన్న భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయాడు అందుకోసం తన భార్యకు రూ.4.2లక్షల కోట్ల ఆస్తిని విడాకుల భరణంగా ఇచ్చేసాడు.ఫాక్స్ టీవీకి హోస్ట్ గా పనిచేస్తున్న లారెన్ శాంచెజ్ కోసం ఈంత భారీ మూల్యాన్ని  చెల్లించాడు.ఈ వార్తా ఇపుడు ప్రపంచంలోనే సంచలనం గా మారింది.

Read More

రాఫెల్ పై ఘాటుగా స్పందించిన రక్షణమంత్రి నిర్మలా సీతా రామన్!

Published on Jan 05,2019 11:46 AM

రాఫేల్ యుద్ద విమానాల తయారీ కుంభకోణ విషయం లో,లోక్ సభలో రాఫేల్ అంశంపై జరిగిన చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మరియు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  మధ్య చాల ఘాటైన చర్చ జరిగింది. రాఫేల్  యుద్ధ విమానాల కాంట్రాక్టులోకి అంబానీని ఎవరు తీసుకువచ్చారని,రాఫేల్ డీల్ కుంభకోణంలో ప్రధాని మోడీ  పాత్ర ఉందన్న ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని రాహుల్ గాంధీ తెలిపారు.అనిల్ అంబానీ పేరును ప్రధాని మోదీయే సూచించారని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే వెల్లడించినట్లు రాహుల్ గాంధీ  అన్నారు దీనిపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  ఘాటైన  సమాధానం చెప్పారు.బీజేపీకి జాతీయ భద్రతే ముఖ్యమని, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటామని చెప్పారు. మన పక్కన పొరుగుదేశాలు ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతుంటే చూస్తూ కూర్చోమని ఆమె ఘాటుగా స్పందించారు. యూపీఏ ప్రభుత్వ ఉన్నపుడు  కేవలం 18 రఫేల్ యుధ్ధ విమానాల కొనుగోలుకు ప్రయత్నించిందని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటి సంఖ్యను 36కు పెంచామని ఆమె చెప్పారు. యూపీఏ హాయంలో లాగా తమకు 10 ఏళ్లు పట్టలేదని కేవలం 14 నెలల వ్యవధిలోనే ఒప్పందాన్ని పూర్తి చేశామని ఆమె తెలిపారు. 2016 సెప్టెంబర్ 23 నాటి ఒప్పందం మేరకు భారత్ కొనుగోలు చేసిన తొలి రఫేల్ యుధ్ధ విమానం సెప్టెంబర్ లో ఇండియాకు వస్తుందని, మిగిలిన విమానాలు 2022కి అందుబాటులోకి వస్తాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. రఫేల్ విమానాల కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆమె అన్నారు. దేశంలో యుధ్దవిమానాల తయారీ హెచ్ఏఎల్ ను కాదని  విదేశాలకు ఎందుకిచ్చారని,  రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ. హెచ్ ఎఎల్ పనితనం విషయమే కాదు లోపాలు కూడా రాహుల్ గాంధీ  తెలుసుకోవాలని ఆమె వివరించారు.  తేజస్ విషయంలో హెచ్ ఎఎల్ పనితనంలో వెనుక బడిందన. 43 ఆర్డర్ ఇస్తే కేవలం  8 విమానాలు మాత్రమే సమకూర్చారని ఆమె వివరించారు. సైనిక దళాలు నిరంతం అప్రమత్తం ఉండాల్సిన పరిస్థితి ఉందని , సరైన సమయంలో ఆయుధాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని నిర్మల సీతారామన్ తెలిపారు. 2004 నుంచి 2015 వరకు చైనా సుమారు 400 విమానాలను సమకూర్చుకుంది, పొరుగున ఉన్న  పాకిస్థాన్ కూడా తన వైమానిక దళాన్ని రెండింతలు చేసిందని కానీ  ప్రస్తుతం భారత్ లో కేవలం 32 స్క్వాడ్రన్ ల బలం మాత్రమే ఉందని మంత్రి తెలిపారు. ఆయుధాల అవసరాన్ని గుర్తించాల్సిన సందర్భం ఆసన్నమైందన్నారు. 36వ రాఫేల్ 2022లో డెలివరీ అవుతుందని మంత్రి చెప్పారు. 

Read More